Yograj Singh Slams Dhoni Over Hookah Controversy | ధోనీపై విరుచుకుపడ్డ యువరాజ్ తండ్రి
టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కూడా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందరో ప్లేయర్స్... మాజీ ప్లేయర్స్ కూడా ధోనీపై కామెంట్స్ చేసారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మాజీ ప్లేయర్ చేరిపోయ్యారు. తను ఎవరోకాదు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోని నాశనం చేసారని యోగరాజ్ సింగ్ ఎన్నో సార్లు నిందించారు. 2011 వరల్డ్ కప్ తర్వాత ధోని టీమ్ ను నాశనం చేసాడని అన్నారు.
ఇప్పటికే ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇర్ఫాన్ పఠాన్ పాత వీడియో వైరల్ అవుతుండడంతో ఇర్ఫాన్ స్పందించారు కూడా. ఈ విషయంపై కూడా యోగరాజ్ తన అభిప్రాయాన్ని చెప్పారు.
యోగరాజ్ మాట్లాడుతూ, “నేను మఫత్‌లాల్ టీంలో 11 సంవత్సరాలు ఆడాను. కానీ, ఎవరికీ హుక్కా తయారు చేయమని చెప్పలేదు. గంభీర్, సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్స్ ను పాలలో నుంచి ఈగను తీసిపారేసినట్లుగా దూరం పెట్టారని అంటున్నారు యోగరాజ్.
దీనికి ధోనీ సమాధానం చెప్పడం ఇష్టం లేదని... ఎందుకు ఇలా చేశాడో అతన్ని అడగండి. సమాధానం చెప్పని వ్యక్తిని దొంగ అనాల్సిందే. నేను కపిల్ దేవ్ గురించి మాట్లాడుతాను, బిషన్ సింగ్ బేడి గురించి మాట్లాడుతాను. ధోనీ గురించి మాట్లాడుతాను. 2011 తర్వాత, మన కెప్టెన్ క్రికెటర్లను, జట్టును నాశనం చేశాడు” అని అంటున్నారు యోగరాజ్. తనపై వస్తున్న ట్రోల్స్ పై ధోని స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి.





















