Irfan Pathan Comments on MS Dhoni | ధోనీపై ట్రోల్స్.. స్పందించిన ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ తాను కెప్టెన్ గా ఉన్న టైం లో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్ జరుగుతుంది. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ముగిసిపోవడానికి ధోనీనే కారణమంటూ కొంతమంది డైరెక్ట్ గా నే కామెంట్స్ పెడుతున్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఒకప్పుడు చాలా అద్భుతంగా రాణించాడు. బౌలర్ నుంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పఠాన్.. టీం లో కీ ప్లేయర్ అయ్యాడు. కానీ 2012 లో తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది. టీంలో తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేడం లేదు అని కోచ్‌ని అడిగితే.. తన చేతుల్లో ఏం లేదని చెప్పారట.
అయితే 2020లో ఈ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడారు. తాను ఎవరి రూమ్‌లోనూ హుక్కా ఏర్పాటు చేసే వ్యక్తిని కాదని, కేవలం గ్రౌండ్ లో ఆడడమే తన పనంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఇండైరెక్ట్ గా ఇర్ఫాన్.. ధోనీనే అంటున్నారని అప్పట్లో కాంట్రోవర్సి అయింది. ఇదే విషయం ఇప్పుడు మళ్ళి తెరపైకి వచ్చింది. నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ కు ఇర్ఫాన్ కూడా స్పందించారు. ఎప్పుడో పాత వీడియో మళ్లీ బయటకు రావడం, దానిపై చర్చలు మొదలవ్వడం... ఇదంతా ఫ్యాన్ వార్? లేక పీఆర్ లాబీ? అంటూ ఇర్ఫాన్ ట్వీట్ చేసారు.





















