(Source: ECI | ABP NEWS)
Madharaasi OTT: ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Madharaasi OTT Platform: కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'మదరాసి' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి రానుంది.

Siva Karthikeyan's Madharaasi OTT Release On Amazon Prime Video: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబోలోని లేటెస్ట్ హై యాక్షన్ థ్రిల్లర్ 'మదరాసి' శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'మదరాసి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు 4 వారాల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే విద్యుత్ జమ్వాల్, షబీర్, విక్రాంత్, బిజు మేనన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
Also Read: ప్రతీ అడుగులో నన్ను నడిపించిన బెస్ట్ టీచర్ - తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
స్టోరీ ఏంటంటే?
తమిళనాడులోకి గన్స్ కల్చర్ వచ్చేలా చేసి లాభం పొందాలనుకుంటుంది ఓ ముఠా. ఇందు కోసం 6 ట్రక్కులో గన్స్ స్మగ్లింగ్ చేస్తుంది. ఈ విషయం ఎన్ఐఏకు తెలిసి ఎలాగైనా వాటిని పట్టుకోవాలని రంగంలోకి దిగుతుంది. స్మగ్లింగ్ ముఠాను విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) ఇద్దరు ఫ్రెండ్స్ లీడ్ చేస్తుంటారు. ప్రేమ్ నాథ్ (బిజు మేనన్) నేతృత్వంలోని ఎన్ఐఏ గ్రూప్ ఆ గన్స్ పట్టుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు.
అయితే, ఆ గన్స్ దాచిన ఫ్యాక్టరీని పేల్చేయాలని ఎన్ఐఏ ప్లాన్ చేస్తుంది. ఇది చాలా రిస్కీ ఆపరేషన్. సరిగ్గా అదే టైంలో లవ్ ఫెయిలై సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు రఘు (శివ కార్తికేయన్). రఘని చూసిన ప్రేమ్ ఈ ఆపరేషన్‌కు అతనే సరైన వ్యక్తి అని సెలక్ట్ చేస్తాడు. మరి ఈ ఆపరేషన్ ఎలా చేశారు? అసలు రఘు ఎవరు? మాలతి (రుక్మిణి వసంత్) రఘుకు ఉన్న సంబంధం ఏంటి? రఘుకు ఎన్ఐఏకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















