Manchu Manoj: ప్రతీ అడుగులో నన్ను నడిపించిన బెస్ట్ టీచర్ - తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
Mohan Babu: మంచు మనోజ్ టీచర్స్ డే సందర్భంగా విషెష్ చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన తండ్రి మోహన్ బాబు తనకు బెస్ట్ టీచర్ అంటూ ఆయన రాసుకొచ్చారు.

Manchu Manoj Emotional Post On Mohan Babu: యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి ఎమోషనల్ అయ్యారు. టీచర్స్ డే సందర్భంగా అందరి గురువులకు విషెష్ చెబుతూనే తన తండ్రి మోహన్ బాబుపై పోస్ట్ పెట్టారు. తన లైఫ్‌లో ఉత్తమ గురువు తన తండ్రి మోహన్ బాబు అని అన్నారు.
బెస్ట్ టీచర్
తన ప్రతీ అడుగులో తనకు బెస్ట్ టీచర్ తన తండ్రి మోహన్ బాబు అని తెలిపారు మంచు మనోజ్. 'నా ప్రతీ అడుగులో నన్ను నడిపించిన బెస్ట్ టీచర్ నాన్న మోహన్ బాబు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన జీవితాలను తీర్చిదిద్దుతున్న అద్భుతమైన ఉపాధ్యాయులందరికీ ఈ స్పెషల్ డే రోజున నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మనస్పర్థలు నెలకొన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లారు. మోహన్ బాబు, విష్ణు కలిసి ఉండగా మనోజ్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై పోస్ట్ చేయడంతో ఆసక్తి నెలకొంది.
To the best teacher who has guided me at every step, Happy Teachers’ Day @themohanbabu nanna garu ❤️❤️
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 5, 2025
And to all the wonderful teachers who continue to shape our lives, my heartfelt wishes on this special day 🙏🏻🙏🏻#HappyTeachersDay pic.twitter.com/uu6Z3foMgn
Also Read: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు భారీ షాక్! లుకౌట్ నోటీసు జారీ చేసిన ముంబై పోలీసులు
ఇక సినిమాల విషయానికొస్తే... మనోజ్ రీసెంట్‌గా భైరవం మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా, యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ హీరోగా నటిస్తోన్న సూపర్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'మిరాయ్' మూవీలో విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌లో చూపించిన ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.





















