Asia Cup 2025 | కంగారు పెట్టిస్తున్న టీం ఇండియా గణాంకాలు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈసారి టీమ్ ఇండియా ఆసియా కప్ ఆడనుంది. అయితే ఆసియా కప్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు పెద్ద ఆందోళన కలిగిస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 22 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, 17 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోయారు. 22 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా లేనప్పుడు 61 మ్యాచ్‌ల్లో 2040 పరుగులు చేశాడు. కెప్టెన్సీకి ముందు సూర్య మూడు సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించాడు.
రింకూ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటివరకు 546 పరుగులు చేశాడు. కానీ గత రెండు సిరీస్‌లలో పెద్దగా రాణించలేదు. సంజు శామ్సన్ కేరళ క్రికెట్ లీగ్ లో మంచి ఫామ్‌లో కనిపించాడు. అయితే సంజు ఓపెనర్ గా వస్తారా లేదా అన్నది చూడాలి. ఇలా ఆసియా అప్ కు ముందు ప్లేయర్స్ రికార్డ్స్ ఫ్యాన్స్ ను కాస్త కంగారు పెడుతున్నాయి. ప్లేయింగ్ 11 లో ఎవరు చోటు దక్కించుకుంటారో.. ఎవరు బెంచ్ పై ఉంటారు.. ఎవరు ఓపెనర్ గా వస్తారన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది.





















