అన్వేషించండి

RRB Technician Posts: నిరుద్యోగులకు అలర్ట్, రైల్వేల్లో 9,144 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మార్చి 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 8 వరకు ఆన్‌లైన్‌  ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

RRB Technician Recruitment 2024: దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫిబ్రవరి 17న సంక్షిప్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 8న విడుదలకాగా.. మార్చి 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీనిద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ల పరిధిలోని ఖాళీలను భర్తీచేయనున్నారు.

ఆయా రైల్వే రీజియన్ల వెబ్‌సైట్‌లలో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఆన్‌లైన్‌  ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈబీసీలు, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్‌ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి.

వివరాలు..

🔰 టెక్నీషియన్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 9,144

➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,092 పోస్టులు

➥ టెక్నీషియన్ గ్రేడ్-III: 8052 పోస్టులు

 టెక్నీషియన్ (గ్రేడ్-I) సిగ్నల్ పోస్టులు..

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్)  ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 3-6-8 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; రైల్వే (గ్రూప్-సి, గ్రూప్-డి) ఉద్యోగులకు కేటగిరీలవారీగా 40-43-45 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. రైల్వే శాఖలో క్వాసీ-అడ్మినిస్ట్రేటివ్ (క్యాంటిన్, సహకార సంఘాలు, ఇతర) కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి 5 సంవత్సరాలపాటు లేదా నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.

టెక్నీషియన్ (గ్రేడ్-III) పోస్టులు..

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 3-6-8 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; రైల్వే (గ్రూప్-సి, గ్రూప్-డి) ఉద్యోగులకు కేటగిరీలవారీగా 40-43-45 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. రైల్వే శాఖలో క్వాసీ-అడ్మినిస్ట్రేటివ్ (క్యాంటిన్, సహకార సంఘాలు, ఇతర) కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి 5 సంవత్సరాలపాటు లేదా నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది. అదేవిధంగా ఒంటరి/వితంతు మహిళలకు కేటగిరీలవారీగా 35-38-40 సంవత్సరాలు,; ఐటీఐ అర్హత ఉండి, యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసినవారికి 3 సంవత్సరాలవరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:  సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం:

RRB Technician Posts: నిరుద్యోగులకు అలర్ట్, రైల్వేల్లో 9,144 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.04.2024.

➥ దరఖాస్తుల సవరణ: 09.04.2024 - 18.04.2024.

Notification

Online Application

Website

ALSO READ:

'అగ్నివీరుల' నియామకానికి ఏఆర్‌వో-సికింద్రాబాద్‌ నోటిఫికేషన్ - దరఖాస్తు ఎంపిక వివరాలు ఇలా
సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget