అన్వేషించండి

Agniveervayu Application: ‘అగ్నివీర్‌ వాయు’ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Agniveer Vayu Recruitment 2024: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ (01/2025) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభంమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఫిబ్రవరి 6లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక పరీక్షలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా ఆధార్‌కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది, దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే సికింద్రాబాద్-12 ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్‌ను 040-27753500 నంబరులో లేదా ఈమెయిల్: co.12asc-ap@gov.in ద్వారా సంప్రదించవచ్చు.

వివరాలు..

* ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ (01/2025)

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)/ ఇంటర్‌ ఒకేషనల్‌. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 02.01.2004 నుంచి 02.07.2007 మధ్య జన్మించి ఉండాలి. ఒకవేళ, ఒక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ యొక్క అన్ని దశలను క్లియర్ చేసినట్లయితే, నమోదు చేసుకున్న తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు ఉండాలి.

ఫిజికల్ స్టాండర్డ్స్:

⏩ ఎత్తు: పురుష అభ్యర్థులకు ఎత్తు 152.5 సెం.మీ; మహిళా అభ్యర్థులకు నార్త్ ఈస్ట్ లేదా ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు 152 సెం.మీ, తక్కువ కనిష్ట ఎత్తు 147 సెం.మీ. లక్షద్వీప్ అభ్యర్థుల విషయంలో కనీస ఎత్తు 150 సెం.మీ.

⏩ బరువు: ఎత్తు మరియు వయస్సుకు అనులోమానుపాతంలో ఉంటుంది.

⏩  చెస్ట్: పురుష అభ్యర్థులకు కనిష్ట ఛాతీ: 77 సెం.మీ ఛాతీ విస్తరణ కనీసం 05 సెం.మీ ఉండాలి, మహిళా అభ్యర్థుల ఛాతీ అనులోమానుపాతంలో ఉండాలి మరియు ఛాతీ విస్తరణ కనిష్టంగా 05 సెం.మీ ఉండాలి.

⏩ వినికిడి: సాధారణ వినికిడిని కలిగి ఉండాలి. అంటే ప్రతి చెవి ద్వారా 06 మీటర్ల దూరం నుండి మాటలు వినగలగాలి.

⏩ డెంటల్: ఆరోగ్యకరమైన చిగుళ్ళు, మంచి దంతాలు మరియు కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఫీజు: రూ.550.

ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 17.01.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: 06.02.2024.

➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 17.03.2024.

Notification

Online Application

ALSO READ:

CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు, వీరిక ప్రత్యేకం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty)  నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Embed widget