IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, అర్హతలివే!
ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(02/ 2023) నియామకాలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంటర్మీడియట్(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 26.12.2002 నుంచి 26.06.2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:17.03.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 31.03.2023.
➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 20.05.2023.
Also Read:
డీఆర్‌డీవో-జీఆర్‌టీఈలో 150 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 16 వరకు తమ దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..