అన్వేషించండి

IBPS RRB Recruitment: ఆర్‌ఆర్‌బీ 'పీవో' ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండి!

ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో పీవో పరీక్ష ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు.

గ్రామీణ బ్యాంకుల్లో పీవో (గ్రూప్-ఎ ఆఫీసర్ స్కేల్-1) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీక్ష పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సెప్టెంబరు 14న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. సెప్టెంబరు 20 వరకు ఫలితాలు అందబాటులో ఉంటాయి. అభ్యర్థుల స్కోరు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్‌ అసిస్టెంట్‌-4483 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ I -2676 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ II - 867 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ III - 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్‌ అసిస్టెంట్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేయగా.. ఆఫీసర్ స్కేల్-1 ఫలితాలను సెప్టెంబరు 14న విడుదల చేశారు. ఆఫీసర్ స్కేల్-II, స్కేల్-III ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. 

ఫలితాలు ఇలా చేసుకోండి.. 
1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.ibps.in/

2) అక్కడ హోంపేజీలో కనిపించే '' Officer Scale -I'' ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను
నమోదుచేయాలి.

4) కంప్యూటర్ తెర మీద పీవో పరీక్షకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి.

5) అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపచుకోవాలి.


ముఖ్యమైన తేదీలు...

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు
  • అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు (ఆన్‌లైన్)- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్- 9 జూలై 2022
  • ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్- 18 జూలై 2022
  • ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- జూలై/ఆగస్టు 2022
  • ప్రిలిమ్స్ ఎగ్జామ్- ఆగస్టు 2022
  • ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు- సెప్టెంబర్ 2022
  • మెయిన్స్/సింగిల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- సెప్టెంబర్ 2022
  • మెయిన్/సింగిల్ ఎగ్జామ్- సెప్టెంబర్ 2022
  • మెయిన్/సింగిల్ ఎగ్జామ్ రిజల్ట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్ 2022
  • ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022
  • ఇంటర్వ్యూ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022
  • ప్రొవిజనల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III & ఆఫీసర్ అసిస్టెంట్ (మల్టీపర్పస్))- జనవరి 2023.


Also Read:

IBPS: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్ స్కోర్‌ కార్డు వచ్చేసింది, డౌన్‌లోడ్ చేసుకోండి!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఆర్‌ఆర్‌బీ క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన స్కోరుకార్డును విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్; పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాల ఆధారంగా స్కోరు కార్డును పొందవచ్చు. సెప్టెంబరు 24 వరకు మార్కుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.
స్కోరుకార్డు, మెయిన్ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

వెబ్‌సైట్‌లో 'క్లర్క్' మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లు..
ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు(కాల్ లెటర్లు) విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మెయిన పరీక్ష కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 24న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
మెయిన్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget