News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IBPS: 'క్లర్క్' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్లర్క్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు గడువు జులై 21తో ముగియ‌గా.. మరోవారం రోజులపాటు గడువును పొడిగించారు.

FOLLOW US: 
Share:

ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్‌) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. అయితే క్లర్క్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు గడువు జులై 21తో ముగియ‌గా.. మరోవారం రోజులపాటు గడువును పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు జులై 28 వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్ కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా  రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.

సిబిల్‌ స్కోర్‌ ఉంటేనే? 
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా నిబంధన విధించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మంచి క్రెడిట్‌ హిస్టరీ ఉంచాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. క్లర్క్‌ ఉద్యోగ దరఖాస్తుకు సిబిల్‌ స్కోర్‌ కనీసం 650 లేదా ఆ పైన కలిగి ఉండాలని తెలిపింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా సంబంధించి రుణం లేదన్నట్లు 'నో అబ్జెక్షన్‌' సర్టిఫికేట్ సమర్పించాలని పేర్కొంది. సిబిల్‌ స్కోర్‌ నమోదులో విఫలమైతే అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేయమని వెల్లడించింది.

ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే  ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున.. గంట వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థి ప్రతి విభాగంలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ స్కోర్ దాటిన అభ్యర్థులను మాత్రమే ఖాళీలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.

మెయిన్ పరీక్ష: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు. వీరిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.
 
ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2023.  (28.07.2023 వరకు పొడిగించారు)

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 26.08.2023, 27.08.2023, 02.09.2023.

➥ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి: సెప్టెంబరు/అక్టోబరు 2023.

➥ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబరు/ అక్టోబరు, 2023.

➥ మెయిన్ పరీక్ష తేదీ(ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 07.10.2023.

➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Jul 2023 04:58 PM (IST) Tags: IBPS Institute of Banking Personnel Selection online application process official website ibps crp clerk recruitment eligibility criteria and important dates clerk recruitment clerical cadre vacancies

ఇవి కూడా చూడండి

Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!

Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!