అన్వేషించండి

IB Recruitment 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి

IB Recruitment 2023 Last Date: ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 13తో ముగియనుంది.

IB Recruitment 2023 Exam Date: కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 13తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 

పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 677

1) సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్: 362 పోస్టులు (ఏపీ-05, తెలంగాణ-07)

2) మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్: 315 పోస్టులు (ఏపీ-10, తెలంగాణ-10)

అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ (LMV) కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలలోపు, మల్టీటాస్కింగ్/జనరల్ పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం: 

టైర్-1 పరీక్ష: మొత్తం 100 మార్కులకు టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ అవేర్‌నెస్-40 మార్కులు-40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ & రీజనింగ్-20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిస్ లాంగ్వేజ్-20 ప్రశ్నలు-20 మార్కులు, పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు (ఒక గంట).

టైర్-2 పరీక్ష (ఎస్ఏ/ఎంటీ): మొత్తం 50 మార్కులకు టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షకు ఎలాంటి నిర్దిష సమయమంటూ లేదు. కనీస అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అలాగే ఎంటీఎస్ పోస్టులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్) నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీస అర్హత మార్కులను 20 శాతంగా నిర్ణయించారు.

జీతం: సెక్యూరిటీ అసిస్టెంట్/మోటాన్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.18,000 - రూ.56,900 జీతంగా చెల్లిస్తారు. 

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.

Notification

Online Application

Website

ALSO READ:

➥ ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు రూ.69,100 వరకు జీతం

➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,832 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Embed widget