తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ప్రస్తుతం గురుకల కొలువుల్లో అత్యధికంగా బీసీ స్కూల్స్‌లోనే ఖాళీలు ఉన్నాయి.
తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. గురుకుల విద్యాసంస్థల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దీనికి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ప్రక్రియ ప్రారంభించింది.
తెలంగాణలోని నాలుగు గురుకుల సొసైటీల్లో ఈ 9,096 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియను టీఆర్‌ఈఐ-ఆర్‌బీకి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఉద్యోగ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు సమాచారాన్ని రెడీ చేస్తోంది.
కొత్త జోనల్ విధానం కారణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త ఆలస్యమైంది. 317 నెంబర్ జీవో ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపుల పూర్తి కాగా ఆ సమాచారం ప్రభుత్వానికి చేరింది. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే వెంటనే భర్తీకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం గురుకల కొలువుల్లో అత్యధికంగా బీసీ స్కూల్స్‌లోనే ఖాళీలు ఉన్నాయి. సగానికిపైగా ఖాళీలు మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో ఉన్నాయి. 2267 ఉద్యోగాలు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలో ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,514, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,445 పోస్టులు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ ఫలితాలు కూడా వచ్చేయడంతో గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేవు ఇక పీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన నిబంధనలు సైతం ఖరారయ్యాయి.
ఇప్పటికే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలు మొదలయ్యాయి. ఈ మధ్య ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష నిర్వహించింది ప్రభుత్వం. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలు పూర్తైన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి నోటిఫేకేషన్లు వేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
Also Read: ఎస్‌ఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్, అందరికీ 8 మార్కులు, బోర్డు కీలక నిర్ణయం!
Also Read: తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఈ ఉద్యోగాలు అప్లై చేశారా
న్యూఢిల్లీలోని దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పని అనుభవం తప్పనిసరి. సరైన అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో)లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2022 మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు విధిగా పనిచేస్తున్నట్లు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి