SI Preliminary Key: ఎస్ఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్, అందరికీ 8 మార్కులు, బోర్డు కీలక నిర్ణయం!
ఎస్ఐ రాతపరీక్ష్ కీ ప్రకారం ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లినట్లు గుర్తించారు. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు.
SI Answer Key: తెలంగాణలోని పోలీసు విభాగంలో 554 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 7న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఆగస్టు 12న అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లినట్లు గుర్తించారు. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని లేల్చారు.
ఇంగ్లిష్-తెలుగు వెర్షన్‌లోని 'ఎ' సీరిస్ బుక్‌లెట్‌లో 43, 111, 146,173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు.
Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
'ఎ' బుక్‌లెట్‌లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి బబ్లింగ్ చేసినా మార్కులు ఇస్తారు. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలిపే అవకాశమూ లేకపోలేదు.
తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉన్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశముంది. దీంతో బహుళ సమాధానాలున్న ప్రశ్నలకూ మార్కులు కలపాలనేది నిపుణుల అభిప్రాయం. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను అర్హతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం ప్రకారం 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో ఉత్తీర్ణులైనట్లే. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన ఆయా అభ్యర్థులు తర్వాతి దశలో ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించినవారవుతారు.
ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి...
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలకు అవకాశం..
తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం (ఆగస్టు 12) సాయంత్రం విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కీ'ని అధికారిక వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కీ చూసుకోవచ్చు. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని బోర్డు సూచించింది. ఆగస్టు 13న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని కోరింది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధార ధ్రువపత్రాలను జతపరచాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలను, ఆధారాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. అదేవిధంగా వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యర్థనలను స్వీకరించరు.
Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష ఆగస్టు 7 పోలీసుల బందోబస్తు మధ్య కట్టుదిట్టంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో 538 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ.. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.
ఉదయం 9 గంటల నుండి ఆయా పరీక్షా కేంద్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రానికి సుమారు 100 మీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేసి అభ్యర్థుల తల్లిదండ్రులు సహాయకులను దూరంగా ఉంచారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షా జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.
పరీక్షకు 91.32 శాతం అభ్యర్థులు హాజరు...
రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిటో 2,25,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా నల్లగొండ-1 రీజినల్ సెంటర్ నుంచి 96 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. అత్యల్పంగా మేడ్చల్-5 రీజినల్ సెంటర్ నుంచి 75 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
జిల్లాలవారీగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...