TS SI Exam Key : తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TS SI Exam Key : తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల అయింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక సైట్ లో కీ అందుబాటులో ఉంచారు.
తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఎస్ఐ రాత పరీక్ష కీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం (ఆగస్టు 12) సాయంత్రం విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కీ ని అధికారిక వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కీ చూసుకోవచ్చు.
అభ్యంతరాలకు అవకాశం..
ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని బోర్డు సూచించింది. ఆగస్టు 13న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని కోరింది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను జతపరచాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలను, ఆధారాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్సర్ కీ చెక్ చేసుకోండి..
PWT Preliminary Key of English-Telugu Version
PWT Preliminary Key of English-Urdu Version
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష ఆదివారం (ఆగస్టు 7) పోలీసుల బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో 538 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ.. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.
ఉదయం 9 గంటల నుండి ఆయా పరీక్షా కేంద్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రానికి సుమారు 100 మీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేసి అభ్యర్థుల తల్లిదండ్రులు సహాయకులను దూరంగా ఉంచారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షా జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.
91.32 శాతం అభ్యర్థులు హాజరు...
రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిటో 2,25,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా నల్లగొండ-1 రీజినల్ సెంటర్ నుంచి 96 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. అత్యల్పంగా మేడ్చల్-5 రీజినల్ సెంటర్ నుంచి 75 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
జిల్లాలవారీగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!
టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...