FCI Admit Cards: ఎఫ్‌సీఐ 'ఫేజ్-2' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫేజ్-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న ఫేజ్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్‌కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
స్టెప్-1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. - fci.gov.in
స్టెప్-2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Current Recruitment' సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఇప్పుడు కిందకు స్క్రోల్ చేసి "To download the Call Letter of Phase-II exam with respect to Advt. No. 01/2022-FCI Cat-III " లింక్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్-4: హాల్‌టికెట్‌కు సంబంధించిన లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-5: అభ్యర్థులు అక్కడ తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-6: FCI అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
స్టెప్-7: అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షకు వచ్చేప్పుడు కాల్ లెటర్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న ఫేజ్-2 పరీక్ష హాల్‌టికెట్లను తాజాగా అధికారులు విడుదల చేశారు.
ఫేజ్-2 పరీక్ష విధానం:
పోస్టుల వివరాలు..
* కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు: నార్త్ జోన్-2388, సౌత్ జోన్-989, ఈస్ట్ జోన్-768, వెస్ట్ జోన్-713, నార్త్‌ఈస్ట్‌జోన్-185.
1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్): 48 పోస్టులు
2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్): 15 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 73 పోస్టులు
4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్): 948 పోస్టులు
5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్): 406 పోస్టులు
6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్): 1406 పోస్టులు
7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో): 2054 పోస్టులు
8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ): 93 పోస్టులు
జీతం:
➥ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రూ.34,000 - రూ.1,03,400. ఇతర భత్యాలు అదనం.
➥ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.30,500 - రూ.88,100. ఇతర భత్యాలు అదనం.
➥ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.28,200 - రూ.79,100. ఇతర భత్యాలు అదనం.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఆపై ఉపాధి కల్పన!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గ్రీన్ జాబ్' కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌పై మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయినవారికి ఆపై ఉపాధి అవకాశం కూడా కల్పించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
TSSPDCL: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి జనవరి 17న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిభ్రవరి 23న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..