Exim Bank: ఎగ్జిమ్ బ్యాంకులో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
EXIM: ముంబయిలోని ఎగ్జిమ్ బ్యాంకు సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
EXIM Bank Recruitment Notification: ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIM) సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మేనేజర్ (Manager), మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 15
1) మేనేజర్(మిడిల్ మేనేజ్‌మెంట్): 03 పోస్టులు
2) మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీ): 12 పోస్టులు
➥ మేనేజర్ పోస్టులు..
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ, పీజీడీబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ అర్హత ఉండాలి. పీజీ లేదా సీఏ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: అభ్యర్థులు ప్రస్తుతం ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ఫైనాన్స్ సంస్థలు లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కనీసం 4 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి ఎస్టీలకు 39 సంవత్సరాలు, ఓబీసీలకు 37 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.48,170-69,810 చెల్లిస్తారు.
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ, పీజీడీబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ అర్హత ఉండాలి. పీజీ లేదా సీఏ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.01.2024 నాటికి ఎస్టీలకు 33 సంవత్సరాలు, ఓబీసీలకు 31 సంవత్సరాలు, దివ్యాంగులకు 41-43 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.36,000-63,840 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్ పరీక్షలు 100 మార్కులు, డిస్క్రిప్టివ్ పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు.
➥ ఆబ్జెక్టివ్ పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 మార్కులు కేటాయించారు. ఇందులో రీజినింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్/ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఫైనాన్స్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-20 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-20 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 80 నిమిషాలు.
➥ డిస్క్రిప్టివ్ పేపర్‌లో ఇంగ్లిష్ పేపరుకు 25 మార్కులు (లెటర్ రైటింగ్-10 మార్కులు, ఎస్సే రైటింగ్-10 మార్కులు) కేటాయించారు. ఇక ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 5 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 15 మార్కుల చొప్పున 75 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 100 నిమిషాలు.
ముఖ్య తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 01-01-2024.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: జనవరి 2024.
➥ ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.