DRDO Recruitment 2021: డీఆర్డీవోలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి
డీఆర్డీవోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషషన్ విడుదలైంది. మెుత్తం 61 అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. చండీగఢ్‌లోని టర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇక్కడ 61 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. 2021 డిసెంబర్ 20 చివరి తేదీగా ఉంది.
2021 నవంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ-2021 డిసెంబర్ 20గా ఉంది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయోద్దు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టైపెండ్- రూ.7,700 నుంచి రూ.8,050 వరకు ఉంటుంది. అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత హోమ్ పేజీలో Apprentices కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. డీఆర్‌డీఓ టర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ చేయకపోతే దరఖాస్తుల్ని డీఆర్‌డీఓ తిరస్కరిస్తుంది. టెన్త్, ఐటీఐ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ admintbrI@tbrl.drdo.in మెయిల్ ఐడీకి 2021 డిసెంబర్ 20 లోగా పంపించాలి.
Also Read: Jobs 2021: యూనివర్సిటీలలో వివిధ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్.. ఏమేం ఖాళీలు ఉన్నాయంటే..
Also Read: NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం.. ఇంకా రెండు రోజులే ఉంది
Also Read: Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి