By: ABP Desam | Updated at : 28 Nov 2021 03:58 PM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే సెలక్ట్ అయిన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాలి. కాంట్రాక్ట్ మరో ఏడాది పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరఖండ్ లో జాబ్ చేయాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి.. దరఖాస్తు నవంబర్ 16న ప్రారంభమైంది. నవంబర్ 30న ఆఖరి తేదీగా నిర్ణయించారు.
మెకానికల్(Executive(Hydro) Mechanical) 5
సివిల్(Executive (Hydro) Civil) 10
మొత్తం: 15
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. సివిల్ దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూకి పిలిచే అభ్యర్థుల సంఖ్యను తగ్గించేందుకు, అవసరమైతే, ఆన్‌లైన్ స్క్రీనింగ్ / షార్ట్‌లిస్టింగ్ / ఎంపిక పరీక్షను నిర్వహించే హక్కును మేనేజ్‌మెంట్ కలిగి ఉంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/PwBD/XSM కేటగిరీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లిస్తారు. ఇంకా హెచ్ఆర్ఏ/ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు.
Also Read: Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?
/body>