News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Indian Navy Jobs 2021: నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

ఇండియన్ నేవల్‌ షిప్‌ ఎయిర్ క్రాఫ్ట్ యార్టులో ఉన్న పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.  

FOLLOW US: 
Share:

ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో ITI అప్రెంటిస్ ట్రేడ్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది.  173(పురుష మరియు స్త్రీ) ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫుల్ టైమ్ ప్రాతిపదికన కర్ణాటకలోని  కర్వార్‌, గోవాలోని దాబోలిమ్‌లలో పోస్టింగ్ ఉంటుంది. 

నవంబర్ 20, 2021న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 19, 2021న ముగుస్తుంది. ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ రిక్రూట్‌మెంట్ 2021లో అప్రెంటీస్ ట్రేడ్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు.. ఏప్రిల్ 1, 2022 నాటికి 21 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్టీలకు మరో 5 ఏళ్ల సడలింపు ఉందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

ఇండియన్ నావల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ ఖాళీల వివరాలు

పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
నావల్ షిప్ రిపేర్ యార్డ్ 150
నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ 23
మొత్తం 173

విద్యార్హతలు.. 
ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఐటీఐ అప్రెంటీస్ ట్రేడ్ జాబ్స్ 2021 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ట్రేడ్‌లో కనీసం 65% మార్కులతో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.  

ఎంపిక మరియు పే స్కేల్

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం.. పదో తరగతి మరియు ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది. అంతేగాకుండా పరీక్ష, ఇంటర్వ్యూ చేస్తారు. దరఖాస్తుదారులు ఇండియన్ నావల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా అధికారికంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.  వారి దరఖాస్తులను డిసెంబర్ 19, 2021లోపు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్ రూ. 7,700 నుంచి  రూ. 8,050 వరకూ ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ నోటిఫికేషన్ 2021లో అప్లై చేసిన సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి. 'ఆఫీసర్-ఇన్-ఛార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్, కార్వార్, కర్ణాటక - 581308' పోస్టు చేయాలి. ఇండియన్ నావల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ నోటిఫికేషన్ 2021 PDF

Also Read: CCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​లో అప్రెంటీస్​ ఖాళీలు.. పూర్తి వివరాలివే.. 

Also Read: Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే

Published at : 28 Nov 2021 03:31 PM (IST) Tags: Indian Navy navy ITI Indian Naval Ship Aircraft Yard Recruitment 2021 ITI Apprentice latest job notification

ఇవి కూడా చూడండి

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

CSIR UGC NET 2023:  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

IPR Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

IPR Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

టాప్ స్టోరీస్

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!