South Eastern Railway Recrutment: రైల్వేలో 17వందల పోస్టులకు నోటిఫికేషన్.. డిసెంబర్ 14లోపు అప్లై చేసుకోండి
సౌత్ ఈస్టర్న్ రైల్వే 1,785 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 14లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతీయ రైల్వేల ఆధ్వర్యంలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ నోటిఫికేషన్ 2021ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పదిహేడు వందల 85 ఖాళీలను భర్తీ చేయనుంది. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో పని చేయాల్సి ఉంటుంది. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 15న ప్రారంభించింది. డిసెంబర్ 14 సాయంత్రం 5 గంటలతో దరఖాస్తు గడువు ముగియనుంది.
సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2021 వయస్సు ప్రమాణాలు, ఫీజు:
SER ట్రేడ్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం అభ్యర్థులు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. జనవరి 01, 2020 నాటికి 24 ఏళ్లు మించకూడదు. ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, PWD అభ్యర్థులు 10 సంవత్సరాలు సడలింపు పొంద వచ్చు.
అభ్యర్థులు రైల్వే అప్రెంటిస్ జాబ్స్ 2021 కోసం 100 అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
SER అప్రెంటీస్ నోటిఫికేషన్ 2021లో చివరిలో ఇచ్చిన విధంగా SC/ST/PWD,మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 అర్హత :
SER ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ 2021 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50% మార్కులతో మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆగ్నేయ రైల్వే నోటిఫికేషన్ 2021లో పేర్కొన్నట్టుగానే వేతనం చెల్లిస్తారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2021లో ఎలా దరఖాస్తు చేయాలి
SER అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు SER వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. డిసెంబర్ 14, 2021 సాయంత్రం 5 గంటలలోపు పూర్తి వివరాలు అందివ్వాలి. తర్వాత ఆ దరఖాస్తును ప్రింట్ అవుట్ తీసుకొని తమ వద్దే ఉంచుకోవాలి.
Also Read : NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం..
Also Read: నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
Also Read: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి