Jobs 2021: యూనివర్సిటీలలో వివిధ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్.. ఏమేం ఖాళీలు ఉన్నాయంటే..
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ తోపాటు ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు రిక్రూట్ మెంట్ ప్రారంభించాయి.
ఐదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐదు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మొత్తం పోస్టుల సంఖ్య 728. ఈ 728 పోస్టుల్లో 463 అసిస్టెంట్ ప్రొఫెసర్లు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో మొత్తం పోస్టుల సంఖ్య 283 కంటే ఎక్కువగా ఉండగా.. వీటిలో 230కి పైగా పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు సంబంధించినవి.
అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సహా ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేస్తున్న సెంట్రల్ యూనివర్శిటీల జాబితా:
- హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ – 226 పోస్టులు – 17 డిసెంబర్ 2021(అప్లికేషన్ చివరి తేదీ)
- సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ – 71 ఫ్యాకల్టీ పోస్టులు – 20 డిసెంబర్ 2021
- యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ – 267 అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 07 డిసెంబర్ 2021
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – 52 ఫ్యాకల్టీ పోస్టులు – 31 డిసెంబర్ 2021
- గురు ఘాసిదాస్ యూనివర్సిటీ బిలాస్‌పూర్ – 112 ఫ్యాకల్టీ పోస్టులు – రోలింగ్ ప్రకటన
ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల జాబితా:
- సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ మీరట్ -51 అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 10 డిసెంబర్ 2021(అప్లికేషన్ చివరి తేదీ)
- కుమౌన్ యూనివర్సిటీ, నైనిటాల్- 23 డిసెంబర్ 2021
- డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఆగ్రా - 13 డిసెంబర్ 2021
- పండిట్ SNSశుక్లా యూనివర్శిటీ ఆఫ్ షాడోల్- 68 అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 10 డిసెంబర్ 2021
- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI), హైదరాబాద్ - 07 డిసెంబర్ 2021
యూజీసీ నిబంధనల ప్రకారం, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పీహెచ్ డీని కలిగి ఉన్న అభ్యర్థులు NET/SLET/SET యొక్క కనీస అర్హత షరతు నుంచి మినహాయింపు ఉంటుంది.