DRDO Jobs: డీఆర్‌డీవో-సెప్టమ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
డీఆర్‌డీవో-సెప్టమ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DRDO CEPTAM Notification: హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-సెప్టమ్ (DRDO-CEPTEM), కాంట్రాక్టు ప్రాతిపదికన (Contract Jobs) ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్ (Project Store Officer), ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ (Project Senior Admin Assistant), ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ (Project Admin Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత, తగిన అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, అందులో వారు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 11.
పోస్టుల కేటాయింపు: యూఆర్-08, ఓబీసీ-02, ఎస్సీ-01.
1) ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/బీకామ్/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్ డిగ్రీతోపాటు జీఈఎం (గవర్నమెంట్ ఈ మార్కెట్‌ప్లేస్)పోర్టల్‌కు సంబంధించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో తగిన అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్, టైపింగ్ స్కిల్స్ (నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి).
అనుభవం: అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.12.2023 నాటికి 50 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వయోపరిమితిలో సడలింపు తర్వాత గరిష్టంగా 56 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: రూ.59,276.
2) ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్: 05 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/బీకామ్/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్ డిగ్రీతోపాటు జీఈఎం (గవర్నమెంట్ ఈ మార్కెట్‌ప్లేస్)పోర్టల్‌కు సంబంధించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో తగిన అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్, టైపింగ్ స్కిల్స్ (నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి).
అనుభవం: అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.12.2023 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వయోపరిమితిలో సడలింపు తర్వాత గరిష్టంగా 56 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: రూ.47,496.
3) ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: 05 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/బీకామ్/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) అర్హత ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్, టైపింగ్ స్కిల్స్ (నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి).
అనుభవం: అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.12.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వయోపరిమితిలో సడలింపు తర్వాత గరిష్టంగా 56 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: రూ.35,220.
దరఖాస్తు ఫీజు: 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ తర్వాత, 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలకు 70 శాతంగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 60 శాతంగా నిర్ణయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15.12.2023.
ALSO READ:
➥ 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే
➥ 'టెన్త్' అర్హతతో కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు - 75,768 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply