CSL Recruitment: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 76 డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ పోస్టులు, అర్హతలివే!
అకడమిక్ మార్కులు, ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 19లోగా ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 76 డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మార్కులు, ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 19లోగా ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 76
* డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ పోస్టులు
➥ షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ (మెకానికల్): 59
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
➥ షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 17
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, కనీసం 60శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
ట్రెయినింగ్ వ్యవధి: 2 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 50
మార్కులకు పరీక్ష ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.12600 చెల్లిస్తారు.
దరఖాస్తు చివరితేది: 19.04.2023.
Also Read:
తెలంగాణ ట్రాన్స్‌కోలో 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు!
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆన్‌లైన్ ద్వావరా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండోర్ ఐఐటీలో 34 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- అర్హతలివే!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీ ఇండోర్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..