Coal India Jobs: కోల్ ఇండియాలో 588 జాబ్స్.. మరో 4 రోజులు మాత్రమే గడువు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి..
కోల్ ఇండియా లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 588 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్ 9) ముగియనుంది.
నిరుద్యోగులకు కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 588 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 9తో ముగియనుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అర్హత ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులతో పాటు కోల్ ఇండియా ఉద్యోగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం https://www.coalindia.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు..
మైనింగ్ విభాగం - 253
ఎలక్ట్రికల్ విభాగం - 117
మెకానికల్ విభాగం - 134
సివిల్ విభాగం - 57
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగం - 15
జియాలజీ విభాగం - 12
మొత్తం ఖాళీలు - 588
విద్యార్హత వివరాలు..
మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ / బీఎస్సీ (ఇంజనీరింగ్) లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణలైన వారు అర్హులు. ఇక జియాలజీ విభాగంలోని పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ/ ఎంటెక్ కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయో పరిమితి..
2021 ఆగస్టు 4 నాటికి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా ఉండాలి. ఓబీసీ (నాన్ క్రీమి లేయర్) అభ్యర్థులకు 3 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది. గేట్ 2021 పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా అర్హులను షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి గేట్ పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.