CCIL Recruitment: గుంటూరు- కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టులు
గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
![CCIL Recruitment: గుంటూరు- కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టులు CCIL has released notification for the recruitment of Field Office Staff Posts CCIL Recruitment: గుంటూరు- కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/edc4b564ed5cc2b69357a63d89a7f01a1690492819778522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబరు 2,3 వ తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు..
➥ ఫీల్డ్ స్టాఫ్
➥ ఆఫీస్ స్టాఫ్(అకౌంట్స్)
➥ ఆఫీస్ స్టాఫ్(జనరల్)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకి చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 02, 03.11.2023.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక: The Cotton Corporation of India Limited,
Kapas Bhavan,4/2 Ashok Nagar, P.B.No:227,
Guntur-522002, Andhra Pradesh.
ALSO READ:
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐవోసీఎల్‌లో 1720 ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు, అర్హతలివే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1720 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలుగల అభ్యర్థులు నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)