BIS Recruitment: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 107 కన్సల్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి టింబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్, సివిల్/ఫైర్/మెటలర్జి, స్ర్టక్చరల్ ఇంజినీరింగ్, కెమికల్, పాలీమర్ ఇంజినీరింగ్/ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఎంటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 107
* కన్సల్టెంట్ పోస్టులు
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ సివిల్ ఇంజినీరింగ్: 15
➥ కెమికల్: 06
➥ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 03
➥ ఎలక్ట్రోటెక్నికల్: 06
➥ ఫుడ్ అండ్ అగ్రికల్చర్: 06
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 07
➥ మెడికల్ ఎక్యుప్‌మెంట్ అండ్ హస్పిటల్ ప్లానింగ్: 02
➥ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 09
➥ పెట్రోలియం, కోల్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్: 05
➥ ప్రొడక్షన్ అండ్ జనరల్ ఇంజినీరింగ్: 10
➥ టెక్స్‌టైల్: 08
➥ ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్: 07
➥ వాటర్ రీసోర్సెస్: 06
➥ సర్వీస్ సెక్టార్: 08
➥ మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్: 05
➥ ఆయూష్: 04
అర్హత: పోస్టును అనుసరించి టింబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్, సివిల్/ఫైర్/మెటలర్జి, స్ర్టక్చరల్ ఇంజినీరింగ్, కెమికల్, పాలీమర్ ఇంజినీరింగ్/ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఎంటెక్‌తో పాటు సంబంధిత రంగంలో 5-10 సంవత్సరాలు పనిఅనుభవం ఉండాలి.
వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.
కాలవ్యవధి: పూర్తిగా ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టుపై ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతనం: నెలకు రూ.75,000.
జాబ్ లొకేషన్: ఢిల్లీ NCR.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 30.12.2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2024
ALSO READ:
ఒంగోలు జీజీహెచ్‌లో 298 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
కడప వైద్యారోగ్య విభాగంలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు
కడపలోని వైద్యారోగ్య సేవల ప్రాంతీయ కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్/ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సు లేదా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 12లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.