అన్వేషించండి

BDL Management Trainee Recruitment: బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు, ప్రారంభం జీతం రూ.40 వేలు!

స్ట్రాటజిక్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ రంగంలో దేశ నిర్మాణం కోసం పనిచేయాలనుకునే యువతకి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా  మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల వారీగా విద్యా‌ర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్ట్రాటజిక్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ రంగంలో దేశ నిర్మాణం కోసం పనిచేయాలనుకునే డైనమిక్ యువతకి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీకి చెందిన వివిధ యూనిట్లలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఎంపికైనవారిని హైదరాబాద్ గచ్చిబౌలి యూనిట్, కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, భానూర్ యూనిట్, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా, విశాఖపట్నం, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని ఉన్న యూనిట్లలో నియమిస్తారు.  

వివరాలు..

⋆ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

మొత్తం ఖాళీలు: 37

సీట్ల కేటాయింపు: జనరల్ - 15, ఈడబ్ల్యూఎస్ - 04, ఓబీసీ - 08, ఎస్సీ - 07, ఎస్టీ - 03.

1) మేనేజ్‌మెంట్ ట్రైనీ - ఎలక్ట్రానిక్స్: 12

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా  సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి.  

వయోపరిమితి: 30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. 

2) మేనేజ్‌మెంట్ ట్రైనీ - మెకానికల్: 10

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి.  

వయోపరిమితి: 30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

3) మేనేజ్‌మెంట్ ట్రైనీ - ఎలక్ట్రికల్: 03

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి. 

వయోపరిమితి:30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

4) మేనేజ్‌మెంట్ ట్రైనీ - మెటలర్జీ: 02

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి.  

వయోపరిమితి: 30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

5) మేనేజ్‌మెంట్ ట్రైనీ - కంప్యూటర్ సైన్స్: 02

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి.  

వయోపరిమితి: 30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

6) మేనేజ్‌మెంట్ ట్రైనీ - ఆప్టిక్స్: 01

అర్హత: ఫిజిక్స్ లో ఎంఎస్సీ డిగ్రీ లేదా అప్లైడ్ ఫిజిక్స్ తో పాటు ఆప్టిక్స్, అప్లైడ్ ఆప్టిక్స్, ఫైబర్ ఆప్టిక్స్, లేజర్, ఆప్టో ఎలక్ట్రానిక్స్ లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ తో పాటు ఫోటోనిక్స్ లో స్పెషలైజేషన్ ఎంఎస్సీ(టెక్) చేసి ఉండాలి. లేదా  తత్సమాన కోర్సు చేసి ఉండాలి. 

వయోపరిమితి: 30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

7) మేనేజ్‌మెంట్ ట్రైనీ - బిజినెస్ డెవలప్‌‌మెంట్: 01

అర్హత: మెకానికల్/ఎలక్ట్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్&ఇన్స్ట్రుమెంటేషన్/ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఏదో ఒక  విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మార్కెటింగ్/సేల్స్&మార్కెటింగ్  లేదా తత్సమాన కోర్సులో 2 ఏళ్ల ఎంబీఏ లేదా మార్కెటింగ్/సేల్స్&మార్కెటింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్  గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 30/09/2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం  వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

8) మేనేజ్‌మెంట్ ట్రైనీ - ఫైనాన్స్: 03

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ గానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గానీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత ఉండాలి. లేదా కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తుది పరీక్షలో పాస్ అయి ఉండాలి. చార్టెడ్ అకౌంటంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తుది పరీక్షలో ఉతీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 30/09/2022 నాటికి ఎంబీఏ(ఫైనాన్స్) అర్హత కలిగిన జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులకు 27ఏళ్ళు, ఓబీసీ 30ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి. సీఏ/ఐసీడబ్ల్యుఏఐ(ఫైనాన్స్) అర్హత కలిగిన జనరల్/ఈడబ్ల్యుఎస్ వారికి 28, ఓబీసీ వారికి 31, ఎస్సీ, ఎస్టీ వారికి 33 ఏళ్లు ఉండాలి. 

9) మేనేజ్‌మెంట్ ట్రైనీ - హ్యూమన్ రీసోర్సెస్: 03

అర్హత: హెచ్ఆర్/పీఎం&ఐఆర్/పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ సైన్స్/సోషల్ వెల్ఫేర్/సోషల్ వర్క్ విభాగాల్లో ఏదో ఒక దానిలో రెండేళ్ల ఎంబీఏ (లేదా) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (లేదా) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. 

వయోపరిమితి: 30.09.2022 నాటికి జనరల్/ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు నిండి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

జీతం: రూ. 40,000-1,40,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యుబీడీ / ఎక్స్-సర్వీస్‌మెన్ / అంతర్గత ఉద్యోగులకు ఫీజు నుంచి మినహయింపు 

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కలకత్తా, ముంబై, పాట్నా, త్రివేండ్రం,

విశాఖపట్నం. 

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  28.11.2022 సాయంత్రం 5 గంటల వరకూ

🔰 పరీక్ష తేదీ: జనవరి 2023/ఫిబ్రవరి 2023 లో ఉంటుంది. కంపెనీ వెబ్ సైట్ లో తేదీ ప్రకటిస్తారు. 

Notification 

Online Application

Website 

Also Read:

CISF Recruitment: సీఐఎస్‌ఎఫ్‌లో 787 కానిస్టేబుల్ పోస్టులు - టెన్త్ అర్హత చాలు!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 787 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో  641 పోస్టులు పురుషులకు, మహిళలకు 69 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 77 పోస్టులు కేటాయించారు. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
Google Summer Internship 2027 India: గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget