ASRB: ఐసీఏఆర్‌లో రిసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టులు, వివరాలు ఇలా
న్యూ ఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్యూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ పరిశోధనా సంస్థల్లో టెన్యూర్ బేసిస్‌పై రిసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ASRB Recruitment: న్యూ ఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్యూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ పరిశోధనా సంస్థల్లో టెన్యూర్ బేసిస్‌పై రిసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* రిసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 11
1. అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (యానిమల్ హెల్త్), ఐసీఏఆర్ హెడ్ క్వార్టర్స్, న్యూఢిల్లీ: 01
అర్హత: వెటర్నరీ సైన్సెస్ యొక్క ఏదైనా యానిమల్ హెల్త్ డిసిప్లిన్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా వెటర్నరీ సైన్స్‌లో డాక్టరల్ డిగ్రీతో పాటు కనీసం 10 సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీ, వెటర్నరీ సైన్స్‌తో పాటు యానిమల్ హెల్త్‌పై పరిశోధనా అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
2. అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఇన్లాండ్ ఫిషరీస్), ఐసీఏఆర్ హెడ్ క్వార్టర్స్, న్యూఢిల్లీ: 01
అర్హత: ఫిషరీస్ సైన్సెస్/ఫిషరీ టెక్నాలజీ, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్/ఆక్వాకల్చర్‌లో స్పెషలైజేషన్‌తో పాటు ఏదైనా బ్రాంచ్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా ఇన్‌ల్యాండ్ ఫిషరీస్/ఆక్వాకల్చర్‌లో స్పెషలైజేషన్‌తో బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా వెటర్నరీ/యానిమల్ సైన్స్/బేసిక్ సైన్స్‌లో డాక్టరల్ డిగ్రీతో పాటు ఇన్‌ల్యాండ్ ఫిషరీస్/ఆక్వాకల్చర్‌లోని ఏదైనా రంగంలో కనీసం 10 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
3. అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ బయోసేఫ్టీ), ఐసీఏఆర్ హెడ్ క్వార్టర్స్, న్యూఢిల్లీ: 01
అర్హత: ఎంటమాలజీ/ ప్లాంట్ పాథాలజీ/ నెమటాలజీ/ అగ్రికల్చరల్ కెమికల్స్/బయో సేఫ్టీలో స్పెషలైజేషన్‌తో అగ్రికల్చరల్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా ప్లాంట్ ప్రొటెక్షన్/బయో సేఫ్టీలో స్పెషలైజేషన్‌తో బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
4. డైరెక్టర్, ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ: 01
అర్హత: బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బ్రీడింగ్, ప్లాంట్స్/క్రాప్స్‌కు సంబంధించిన మాలిక్యులర్ బయాలజీలో స్పెషలైజేషన్‌తో అగ్రికల్చరల్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో లేదా బేసిక్ సైన్సెస్‌లో డాక్టోరల్ డిగ్రీ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.2,10,000. స్పెషల్ అలవెన్స్‌గా రూ.11,250.
5. డైరెక్టర్, ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, బెంగళూరు: 01
అర్హత: హార్టికల్చరల్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో డాక్టోరల్ డిగ్రీ లేదా కనీసం 10 సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీతో అగ్రికల్చరల్ సైన్సెస్ / బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ. ఉద్యాన పంటలపై పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
6. డైరెక్టర్, ఐసీఏఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ &ఫిజియాలజీ, బెంగళూరు: 01
అర్హత: వెటర్నరీ సైన్స్ / యానిమల్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా కనీసం 10 సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీతో బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ.
యానిమల్ న్యూట్రిషన్ / యానిమల్ ఫిజియాలజీలో పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
7. డైరెక్టర్, ఐసీఏఆర్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కొచ్చి: 01
అర్హత: ఫిషరీస్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా ఫిషరీస్ సైన్సెస్‌లో ఏదైనా స్పెషలైజేషన్‌తో బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా వెటర్నరీ/యానిమల్ సైన్స్/బేసిక్ సైన్స్‌లో డాక్టరల్ డిగ్రీతో పాటు ఫిషరీస్ సైన్స్‌లో కనీసం 10 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
8. డైరెక్టర్, ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్, కర్నాల్: 01
అర్హత: క్రాప్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో డాక్టోరల్ డిగ్రీ లేదా కనీసం 10 సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీతో అగ్రికల్చరల్ సైన్సెస్/బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ. గోధుమ & బార్లీ పరిశోధనలో పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
9. డైరెక్టర్, ఐసీఏఆర్-షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్, కోయంబత్తూరు: 01
అర్హత: క్రాప్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో డాక్టోరల్ డిగ్రీ లేదా కనీసం 10 సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీతో అగ్రికల్చరల్ సైన్సెస్/బేసిక్ సైన్సెస్‌లో డాక్టరల్ డిగ్రీ. షుగర్ కేన్‌లో పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
10. జాయింట్ డైరెక్టర్ (CADRAD), ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇజత్‌నగర్: 01
అర్హత: వెటర్నరీ సైన్సెస్ యొక్క ఏదైనా యానిమల్ హెల్త్ డిసిప్లిన్‌లో డాక్టరల్ డిగ్రీ లేదా వెటర్నరీ సైన్స్‌లో డాక్టరల్ డిగ్రీ,కనీసం 10 సంవత్సరాల పోస్ట్ పీహెచ్‌డీతో యానిమల్ హెల్త్ పోకస్ ఆన్ వెటర్నరీ సైన్స్‌లో పరిశోధన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
11. జాయింట్ డైరెక్టర్, ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్: 01
అర్హత: ARS యొక్క ఏదైనా విభాగంలో డాక్టరల్ డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచ్ యొక్క బేసిక్ సైన్సెస్/సోషల్ సైన్సెస్‌తో పాటు మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.1,44,200 – రూ.2,18,200.
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.03.2024.