AP TET 2022 Hall Tickets: ఏపీ టెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
AP TET Admit Card 2022: ఏపీలో టెట్ నిర్వహణకు అంతా సిద్ధం చేశారు. ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఏపీ టెట్ 2022 నిర్వహిస్తున్నారు.
AP TET 2022 Hall Tickets Download: ఏపీ టెట్ పరీక్షకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET Admit Card 2022) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 25న టెట్ హాల్ టికెట్స్ విడుదల చేశారు. అభ్యర్థులు https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం సెషన్స్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 6 శనివారం సెషన్ 1 ప్రారంభం కాగా, ఆగస్టు 21 ఆదివారం సెషన్ 22లో షిఫ్ట్ 2తో ఏపీ టెట్ పరీక్షలు ముగియనున్నాయి. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్
Click Here To Download AP TET 2022 Hall Ticket
వెబ్‌సైట్‌లో టెట్ హాల్ టికెట్స్..
అధికారిక వెబ్‌సైట్ లో లింక్ ఓపెన్ చేశాక, క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలతో అభ్యర్థులు లాగిన్ అవ్వాలి. ఆ తరువాత తమ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ మీద హాల్ టికెట్ కనిపిస్తుంది. అప్పుడు పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకుని, ఆపై ప్రింటౌట్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. జూలై 26 నుంచి మాక్ టెస్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆసక్తి ఉన్న మాక్ టెస్ట్ రాయొచ్చని సూచించింది. ఏపీ టెట్ పేపర్-2A అర్హతలో కొన్ని మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు వచ్చిన వారు పేపర్-2Aకి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆగస్టు 6 నుంచి ఏపీ టెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల చేసింది. దరఖాస్తు దారులు జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్ కీ విడుదల చేసి, సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే APTET-August, 2022 పరీక్షను అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. TET లక్ష్యం జాతీయ ప్రమాణాలు పాటించడం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు అనుగుణంగా నియామక ప్రక్రియలో ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
40 శాతానికి సడలింపు
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉంటే బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తుంది. కానీ టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన ఉంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నారని, ఈ అర్హత మార్కులను 40 శాతానికి సడలించారు. ఈ సడలింపు ఈ ఒక్కసారికే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు 1 నుంచి 5వ తరగతుల బోధనకు పేపర్-1(A, B), ఆరో నుంచి ఎనిమిదో తరగతుల బోధనకు పేపర్-2 (A, B)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.