AP Police Jobs: కానిస్టేబుల్ పోస్టులకు 5 లక్షలకు పైగా దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ!
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది. అంటే ఒక్కో పోస్టుకు 83 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 12 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి నవంబరు 30 నుంచి జనవరి 7 వరకు అవకాశం కల్పించారు. ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు.
కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌ఐ పోస్టుల దరఖాస్తుకు 18 వరకు అవకాశం..
ఏపీలో 411 ఎస్ఐ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వేషన్ పెంపు..
ఒకవైపు నోటిఫికేషన్ వార్తతోపాటు అభ్యర్థులకు మరో తీపి కబురు ప్రభుత్వం వినిపించింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులకు రిజిర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లను 8 నుండి 15 శాతానికి పెంచారు. అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హోంగార్డులకు రిజర్వేషన్లను 10 నుండి 25 శాతానికి పెంచారు.
🔰 కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష విధానం:
➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.
➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.
➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.
➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.
➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు
🔰 మెయిన్ పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.
🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.11.2022.
➥ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.12.2022.
➥ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.01.2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 22.01.2023.
Also Read:
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TSLPRB: కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ప్రతి ఆరుగురిలో ఒకరికి జాబ్ పక్కా? ఎస్‌ఐ పోస్టులకు పోటీ ఇలా!
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా ఫైనల్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..