News
News
వీడియోలు ఆటలు
X

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గ్రూప్-4 ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ మార్చి 24న ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏప్రిల్ 4న ప్రధాన పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ప్రధాన పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను మార్చి 27 నుంచి కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా స్క్రీనింగ్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.

ఏపీ రెవెన్యూ విభాగంలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 31న ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో మొత్తం 1494 మంది అభ్యర్థులు బుక్‌లెట్ సిరీస్ సరిగా వేయకపోవడం, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించడం లాంటి కారణాల వల్ల అనర్హతకు గురయ్యారు.  స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. 

Also Read:

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)లో ప్రవేశాల కోసం నిర్వహించునున్న రాతపరీక్ష అడ్మిట్ కార్డుల(హాల్‌టికెట్ల)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(1)-2023 పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సీడీఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు లేదా మరే ఇతర విధానాల్లోనూ అడ్మిట్‌కార్డు పొందలేరు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో సీడీఎస్ఈ-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. 
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

టీసీఎస్‌‌ 'సిగ్మా హైరింగ్‌-2023' - ఫార్మసీ విద్యార్హతతో ఉద్యోగాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్-సిగ్మా 2023 కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నాలుగేళ్ల బీ-ఫార్మసీ లేదా రెండేళ్ల ఎం-ఫార్మసీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 24 Mar 2023 09:34 PM (IST) Tags: APPSC Group4 Recruitment APPSC Group4 Mains APPSC Group4 Main Exam Date APPSC Group4 Exam

సంబంధిత కథనాలు

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్