News
News
వీడియోలు ఆటలు
X

TCS Hiring: టీసీఎస్‌‌ 'సిగ్మా హైరింగ్‌-2023' - ఫార్మసీ విద్యార్హతతో ఉద్యోగాలు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్-సిగ్మా 2023 కింద ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నాలుగేళ్ల బీ-ఫార్మసీ లేదా రెండేళ్ల ఎం-ఫార్మసీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

FOLLOW US: 
Share:

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్-సిగ్మా 2023 కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నాలుగేళ్ల బీ-ఫార్మసీ లేదా రెండేళ్ల ఎం-ఫార్మసీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు...

* టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సిగ్మా-2023

అర్హతలు..

➥ నాలుగేళ్ల బీఫార్మసీ లేదా రెండేళ్ల ఎంఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పార్ట్ టైమ్/కరస్పాండెన్స్ కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. 

➥ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి సెకండరీ/ సీనియర్ సెకండరీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

➥ ఎంపిక ప్రక్రియ సమయంలో ఒక బ్యాక్‌లాగ్ ఉన్న అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు. పెండింగ్ బ్యాక్‌లాగ్‌లను నిర్దేశించిన కోర్సు వ్యవధిలోపు క్లియర్ చేయాలి.

➥ అకడమిక్‌లో గ్యాప్/బ్రేక్ ఉంటే దరఖాస్తు వివరాల్లో తెలియజేయాల్సి ఉంటుంది. అయితే అకడమిక్ గ్యాప్ 24 నెలలకు మించకూడదు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం: పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. 140 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి సెక్షన్‌లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. 65 నిమిషాల్లో ఈ పరీక్ష పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక రెండో సెక్షన్‌లో డొమైన్ టెస్ట్ ఉంటుంది. 75 నిమిషాల్లో ఈ పరీక్ష పూర్తిచేయాలి. క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్, ఫార్మకోవిజిలెన్స్, రెగ్యులేటరీ అఫైర్స్, జనరల్ డొమైన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు చివరి తేది: 30.03.2023

➥ పరీక్ష తేది: 09.04.2023

Notification

Online Application

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టూరిస్ట్, బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా వెసులుబాటును కల్పించింది. అయితే ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​ (యూఎస్​సీఐఎస్​) మార్చి 23న ట్వీట్​ చేసింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 24 Mar 2023 01:31 PM (IST) Tags: TCS Jobs TCS Hiring TCS Sigma Hiring YoP 2023 TCS Sigma Hiring 2023 TCS Recruitment

సంబంధిత కథనాలు

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

NIRT: చెన్నై ఎన్‌ఐఆర్‌టీలో 24 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

NIRT: చెన్నై ఎన్‌ఐఆర్‌టీలో 24 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!