News
News
వీడియోలు ఆటలు
X

UPSC NDA 1 Admit Card: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు.

FOLLOW US: 
Share:

నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)లో ప్రవేశాల కోసం నిర్వహించునున్న రాతపరీక్ష అడ్మిట్ కార్డుల(హాల్‌టికెట్ల)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న పరీక్ష నిర్వహించనున్నారు.

ఎంపికైనవారికి త్రివిధ దళాల్లో 2024, జనవరి 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 151వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 113వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 
 
అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Step 1: అడ్మిట్ కార్డులు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-upsconline.nic.in

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'eAdmit Cards for VARIOUS EXAMINATIONS OF UPSC' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Step 3: ఇప్పుడు 'NDA/NA 1' అడ్మిట్ కార్డులకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 4: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబర్ వివరాలు నమోదుచేయాలి. 

Step 5: కంప్యూటర్ తెర మీద 'UPSC NDA admit card' కనిపిస్తుంది. 

Step 6: హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 

ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏ4 సైజులో హాల్‌టికెట్ ప్రింట్ తీసుకోవాలి. అడ్మిట్ కార్డులేనిదే పరీక్ష రాయడానికి అనుమతించరు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజిల్ గుర్తింపు కార్డును అభ్యర్థులు పరీక్ష రోజు వెంట తీసుకెళ్లాలి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2023, ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించనుంది.

పోస్టుల వివరాలు...

* ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1)-2023 

ఖాళీల సంఖ్య: 395 

పోస్టుల కేటాయింపు: మొత్తం పోస్టుల్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ-370 పోస్టులు (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్-120). వీటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. ఇక నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) 25 ఖాళీలు ఉన్నాయి.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం: 

➥ మొత్తం 900 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మొత్తం రెండు పేపర్లుంటాయి.

➥ పేపర్-1(మ్యాథమెటిక్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి.

➥ రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

➥ రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.

కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. ఎంపికైనవారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

శిక్షణ: 

➥ తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు.

➥ అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు.

➥ అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

➥ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2022.

➥  ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.01.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2023. 

➥ దరఖాస్తుల ఉపసంహరణ: 18.01.2023 - 24.01.2023.

➥ ఆన్‌లైన్ రాత పరీక్ష: 16.04.2023 

➥ కోర్సులు ప్రారంభం: 02.01.2024.

ఎన్‌డీఏ & ఎన్‌ఐ 2023 పూర్తి నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Published at : 24 Mar 2023 09:03 PM (IST) Tags: UPSC NDA Admit Card 2023 UPSC NDA 2023 Admit Card UPSC NDA 1 Hall Ticket 2023 UPSC NDA 1 Admit Card 2023 UPSC National Defence Academy exam Indian Naval Academy Course

సంబంధిత కథనాలు

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్