APPSC AMVI Application: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తుల సవరణకు ఛాన్స్!!
ఏఎంవీఐ పోస్టులకు అభ్యర్థులు నవంబరు 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి.
ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి, దరఖాస్తుల సవరణకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. దరఖాస్తు సమయంలో వివరాలను తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించి వివరాలు సవరించుకోవచ్చు. దరఖాస్తుల సవరణకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అందుకే తమ వివరాలను సవరించుకోవాలనుకునే అభ్యర్థులు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు తమ బయోడేటా వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. తప్పుగా నమోదుచేసిన వివరాలను గుర్తించాలి. వివరాలను సరిచేసుకున్నాక, దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. బయోడేటా వివరాలను మార్చుకునే అభ్యర్థులు పేరు, జెండర్, పుట్టినతేది వివరాలకు సంబంధించిన సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుల సవరణకు క్లిక్ చేయండి..
హైకోర్టు తాత్కాలిక 'స్టే'..
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు తాత్కాలిక స్టే విధించిన సంగతి తెలిసిందే. పోస్టుల భర్తీ కోసం కేవలం ఇంగ్లిష్ భాషలోనే రాతపరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఒకవైపు 'స్టే' అమల్లో ఉండగానే.. దరఖాస్తుల సవరణకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 2 నుంచి నవంబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
పోస్టుల వివరాలు...
* అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (రవాణా శాఖ)
ఖాళీల సంఖ్య: 17 పోస్టులు (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-15)
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 150 మార్కులు, పేపర్-2 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.
పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు ఇలా..
దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డుదారులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
జీత భత్యాలు: నెలకు రూ.31,460-రూ.84,970.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.11.2022.
➥ ఫీజు చెల్లింపు చివరి తేది: 21.11.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22.11.2022.
Also Read:
'ఏపీపీఎస్సీ'కి షాకిచ్చిన హైకోర్టు, మూడు నోటిఫికేషన్లపై 'స్టే'
ఏపీలో ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు 'స్టే'ల పర్వం కొనసాగుతోంది. అంతకు ముందు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు, ఇతర పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయగా.. తాజాగా వివిధ పోస్టుల భర్తీ కోసం కేవలం ఇంగ్లిష్ భాషలోనే రాతపరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మూడు నోటిఫికేషన్లను నిలిపివేసింది. రాతపరీక్షలో ప్రశ్నలను తెలుగులోనూ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..