News
News
X

AP High Court: 'ఏపీపీఎస్సీ'కి షాకిచ్చిన హైకోర్టు, మూడు నోటిఫికేషన్లపై 'స్టే'

అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

FOLLOW US: 

ఏపీలో ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు 'స్టే'ల పర్వం కొనసాగుతోంది. అంతకు ముందు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు, ఇతర పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయగా.. తాజాగా వివిధ పోస్టుల భర్తీ కోసం కేవలం ఇంగ్లిష్ భాషలోనే రాతపరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మూడు నోటిఫికేషన్లను నిలిపివేసింది. రాతపరీక్షలో ప్రశ్నలను తెలుగులోనూ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. 

హైకోర్టులో దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్  మేరకు నవంబరు 21న ఉత్తర్వులు జారీచేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కాశీ ప్రసన్న కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నోటిషికేషన్ తదుపరి చర్యలను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై కూడా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

అసిస్టెంట్ ఇంజినీర్ నోటిఫికేషన్ కూడా..
అలాగే వివిధ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పరీక్షను ఆంగ్లంలోనే నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సెప్టెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ బి.చరణ్, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్..
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబరు 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ డి.శివశంకర్ రెడ్డి హైకోర్టులో ఇంకొక వ్యాజ్యం వేశారు. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఆ రెండు నోటిఫికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను డిసెంబరు 1కి వాయిదా వేశారు.

News Reels

Also Read:

ప్రకాశం జిల్లాలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు - పూర్తి వివరాలు ఇవీ!
హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్), కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా సంబంధిత చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

Published at : 22 Nov 2022 11:07 AM (IST) Tags: AP Jobs AP High Court APPSC Notifications Stay on Notifications Stay on APPSC Notifications

సంబంధిత కథనాలు

ISRO: ఇంజినీరింగ్ అర్హతతో 'ఇస్రో'లో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి

ISRO: ఇంజినీరింగ్ అర్హతతో 'ఇస్రో'లో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

DPHFW Recruitment: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హతలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?

DPHFW Recruitment: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హతలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

TS Kanti Velugu Jobs: 'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

TS Kanti Velugu Jobs:  'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే