అన్వేషించండి

APPSC Group-2 Postponed: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ

Group2 Mains: ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదావేసింది. ఈమేరకు జులై 3న ప్రకటించింది.

APPSC Group 2 Mains Exam Postponed: ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదావేసింది. పాలనాపరమైన కారణాల వల్ల పరీక్ష వాయిదావేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఎంపికచేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ ఫలితాల ద్వారా మొత్తం 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు.  ఈ పరీక్షకు మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారిలో 92,250 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మెయిన్ రాతపరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. 

అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకే వాయిదా..?
రాష్ట్రంలో జులై 28న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఒకపక్క సిలబస్‌లో మార్పులు, మరోవైపు ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తిస్థాయిలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ.. పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ పలువురు ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాలపై స్పందించిన ఏపీపీఎస్సీ తాజాగా పరీక్షను వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది.

APPSC Group-2 Postponed: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ

గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..

APPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! రిజల్ట్ ఎప్పుడంటే?

ఏపీలో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి  ఏపీపీఎస్సీ(APPSC) గతేడాది డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 

గ్రూప్-2 పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 899

➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333

➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు 
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు 
➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
➥ ఆడిటర్: 10 పోస్టులు
➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు

గ్రూప్-2 పోస్టుల అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget