అన్వేషించండి

AP TET 2022 Hall Tickets : ఏపీ టెట్ పై కీలక అప్ డేట్, హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే?

AP TET 2022 Hall Tickets : ఏపీ టెట్ పరీక్షపై పాఠశాల విద్యాశాఖ కీలక సమాచారం ఇచ్చింది. జులై 25న హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

AP TET 2022 Hall Tickets : ఏపీ టెట్ పరీక్షకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) హాల్ టికెట్లు విడుదల అవుతున్నాయి. అభ్యర్థులు https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జులై 26 నుంచి మాక్‌ టెస్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆసక్తి ఉన్న మాక్ టెస్ట్ రాయొచ్చని సూచించింది. ఏపీ టెట్ పేపర్‌-2A అర్హతలో కొన్ని మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు వచ్చిన వారు పేపర్‌-2Aకి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.  

40 శాతానికి సడలింపు 

రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉంటే బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తుంది. కానీ టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన ఉంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నారని, ఈ అర్హత మార్కులను 40 శాతానికి సడలించారు. ఈ సడలింపు ఈ ఒక్కసారికే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు 1 నుంచి 5వ తరగతుల బోధనకు పేపర్-1(A, B), ఆరో నుంచి ఎనిమిదో తరగతుల బోధనకు పేపర్-2 (A, B)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 

ఆగస్టు 6 నుంచి పరీక్షలు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల చేసింది. దరఖాస్తు దారులు జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్‌ కీ విడుదల చేసి, సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే APTET-August, 2022 పరీక్షను అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. TET లక్ష్యం జాతీయ ప్రమాణాలు పాటించడం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు (National Council for Teacher Education - NCTE) అనుగుణంగా నియామక ప్రక్రియలో ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget