X

Microsoft: ఏపీలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ట్రైనింగ్.. 40 కోర్సుల్లో సర్టిఫికేషన్..

Microsoft: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా 40 కోర్సులలో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది. డేటా సైన్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర కోర్సులలో ట్రైనింగ్ ఇస్తుంది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం సరికొత్త ప్రోగ్రాంను తీసుకొచ్చింది. దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్ సాయంతో సర్టిఫికేషన్ కోర్సులలో శిక్షణ ఇప్పించనుంది. దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సర్టిఫికేషన్ ప్రాజెక్టులో భాగంగా 300కు పైగా కాలేజీలు.. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా 1.62 లక్షల మందికి ఉచితంగా శిక్షణ అందించనున్నారు. 40 కోర్సుల్లో సర్టిఫికేషన్ చేసే సౌకర్యాన్ని కల్పించారు.

సాఫ్ట్‌లైన్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ద్వారా మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుంది. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులపై విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. సర్టిఫికేషన్‌ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ఇన్‌ లెర్నింగ్‌’ (LinkedIn Learning) ద్వారా బిజినెస్, టెక్నికల్‌, క్రియేటివిటీ విభాగాలకు చెందిన 8,600 కోర్సులను కూడా విద్యార్థులు నేర్చుకోవచ్చు. 

Also Read: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..

పరిశ్రమలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ..
ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా అప్‌డేటెడ్ కోర్సులలో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది. డేటా సైన్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తుంది. అజూర్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్థులకు యాప్‌ల అభివృద్ధి, బిగ్ డేటా, ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డేటా ఇంజనీర్, డెవలపర్, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్, ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, డేటా బేస్ ఫండమెంటల్స్, HTML 5 అప్లికేషన్ డెవలప్ మెంట్ ఫండమెంటల్స్, నెట్ వర్కింగ్ ఫండమెంటల్స్, సెక్యూరిటీ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా స్క్రిప్ట్, డేటా అనలిస్ట్ లాంటి ఫ్రీ అజూర్ కోర్సులు నేర్పిస్తుంది. 

Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే.. 

ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ..
మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి వంటి అంశాల పరిశీలనకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కమిటీకి ఏపీ విద్యా శాఖ మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా ఉంటారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ గుర్తించిన విద్యా సంస్థల ద్వారా మాక్‌ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలను చేపడతారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్‌లో భద్రపరుస్తారు.  

Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 

Also Read: టెన్త్ విద్యార్హతతో రైల్వేలో 2226 జాబ్స్ .. నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే.. ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: AP Jobs microsoft AP Skill development program Certification Courses 40 courses Microsoft to train 1.62L students

సంబంధిత కథనాలు

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. అభ్యర్థులు చేయాల్సినవి.. చేయకూడనివి.. ఇవే..

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. అభ్యర్థులు చేయాల్సినవి.. చేయకూడనివి.. ఇవే..

BEL Recruitment 2021: మచిలీపట్నం 'బెల్'లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..

BEL Recruitment 2021: మచిలీపట్నం 'బెల్'లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..

CSIR Recruitment: సీఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.. జీతం ఏంతంటే.. 

CSIR Recruitment: సీఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.. జీతం ఏంతంటే.. 

NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?

NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?

CISF Recruitment: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి

CISF Recruitment: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ..