అన్వేషించండి

AP DSC 2025 Call Letters: ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్

AP Mega DSC candidates certificate verification | మెగా డీఎస్సీ కాల్ లెటర్ల జారీ ఆలస్యం కావడంతో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది.

AP DSC 2025 certificate verification |  అమరావతి: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం (ఆగస్టు 25) నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కావాలి.. కానీ ఈ ప్రక్రియను ఒకరోజు పాటు వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేసింది. పాఠశాల విద్యాశాఖ ఇదివరకే మెగా డీఎస్సీ 2025 మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. డీఎస్సీలో వచ్చిన స్కోర్‌తోపాటు అర్హులైన వారికి ఆయా కేటగిరీల్లో ర్యాంకులు సైతం కేటాయించారు.  ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల కోసం క్లిక్ చేయండి https://apdsc.apcfss.in/MeritList1

1:1 విధానంలో మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్స్

రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఏపీ డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఆదివారం నాడు 1:1 విధానంలో కాల్‌లెటర్లు జారీచేయాల్సి ఉంది. అయితే మెగా డీఎస్సీ ద్వారా జరుగుతున్న టీచర్ పోస్టుల భర్తీలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు మెరిట్ జాబితాలను, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ జారీ జాబితాను రీ చెక్ చేస్తున్నారు.  విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థుల లాగిన్‌కు ఆదివారం కాల్‌ లెటర్లు రావాలి. నేడు (సోమవారం) మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలు కావాల్సి ఉండగా.. కాల్‌ లెటర్ల ప్రక్రియపై విద్యాశాఖ అప్‌డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థులకు కాల్‌ లెటర్లను సోమవారం ఉదయం నుంచి వారి లాగిన్‌లో అందుబాటులో ఉంచుతామని ఆదివారం రాత్రి ప్రకటించింది.


AP DSC 2025 Call Letters: ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్

డీఎస్సీ టాపర్‌కు హోం మంత్రి అనిత సత్కారం
నక్కపల్లి: ఏపీ మెగా డీఎస్సీ 2025లో మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన వమ్మవరానికి చెందిన సుంకరణం విజయ్‌ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సత్కరించారు. నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయ్‌ను అభినందిస్తూ మంత్రి అనిత సన్మానం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలానికి చెందిన విజయ్ ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. స్కూల్ అసిస్టెంట్ (గణితం) విభాగంలో 94.7 మార్కులు, టీజీటీ (గణితం)లో 87.3 మార్కులు, పీజీటీ (గణితం)లో 78.5 మార్కులు సాధించి మూడు విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించడం విశేషం. ఆ అభ్యర్థి విజయాన్ని హోం మంత్రి అనిత గర్వకారణంగా పేర్కొన్నారు. విజయ్  పట్టుదల, కృషి, అంకితభావానికి డీఎస్సీ ఫలితాలే నిదర్శనమని ఆమె అన్నారు. నేటి యువతకు విజయ్ ప్రేరణగా నిలుస్తాడని ఆమె కొనియాడారు. మెగా డీఎస్సీ 2025లో మంచి ర్యాంకులు సాధించిన ఇతర అభ్యర్థులను కూడా మంత్రి వంగలపూడి అనిత అభినందించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget