అన్వేషించండి

AP District Court Exam Schedule: జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీ, అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూలు వెల్లడి!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 21న ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి 2తో ముగియనున్నాయి. పోస్టుల ఆధారంగా తగినన్ని షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పోస్టులవారీగా పరీక్షలు నిర్వహిస్తారు.

ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలును నవంబరు 23న ఏపీ హైకోర్టు విడుదల  చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష పోస్టులవారీగా పరీక్షల తేదీలను చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 21న ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి 2తో ముగియనున్నాయి. పోస్టుల ఆధారంగా తగినన్ని షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల షెడ్యూలు ఇలా...

పోస్టు పేరు సెషన్లు పరీక్ష తేది
స్టెనోగ్రాఫర్/జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్/ ఫీల్డ్ అసిస్టెంట్ (కామన్ టెస్ట్) 12 సెషన్లలో 21.12.2022 (3 షిఫ్టుల్లో)

22.12.2022 (3 షిఫ్టుల్లో)

23.12.2022 (1 షిఫ్టు - మార్నింగ్)

29.12.2022 (2 షిఫ్టుల్లో)

02.01.2023 (3 షిఫ్టుల్లో)
కాపీయిస్ట్/ఎగ్జామినర్/రికార్డ్ అసిస్టెంట్ (కామన్ టెస్ట్) 2 సెషన్లలో 26.12.2022 (1 షిఫ్టుల్లో)
డ్రైవర్/ ప్రాసెస్ సర్వర్/ ఆఫీస్ సబార్డినేట్ (కామన్ టెస్ట్) 8 సెషన్లలో 26.12.2022 (1 షిఫ్టులో)

27.12.2022 (3 షిఫ్టుల్లో)

28.12.2022 (3 షిఫ్టుల్లో)

29.12.2022 (1 షిఫ్టులో)

ప్రకటించిన 3432 పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్-1520, జూనియర్ అసిస్టెంట్-681, ప్రాసెస్‌ సర్వర్-439, కాపీయిస్ట్-209, టైపిస్ట్-170, ఫీల్డ్ అసిస్టెంట్-158, ఎగ్జామినర్-112, స్టెనోగ్రాఫర్-114 పోస్టులు ఉండగా.. మిగతావి రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకీ అక్టోబరు 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 11 వరకు అవకాశం కల్పించారు. ఇక అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.800 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించారు.

AP District Court Exam Schedule: జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీ, అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూలు వెల్లడి!

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 158 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 439 ప్రాసెస్ సర్వర్ పోస్టులు, టెన్త్ అర్హత చాలు!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

 ఏపీ జిల్లా కోర్టుల్లో 114 స్టెనోగ్రాఫర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3) ఉద్యోగాల భర్తీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతోపాటు టైప్-రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) టెక్నికల్ ఎగ్జామినేషన్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, జిల్లాలవారీగా ఖాళీలివే!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 112 ఎగ్జామినర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 170 టైపిస్ట్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్ పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతోపాటు టైప్-రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) టెక్నికల్ ఎగ్జామినేషన్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో 209 కాపీయిస్ట్ పోస్టులు!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైప్-రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) ఎగ్జామ్ అర్హత ఉండాలి. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులు, లైసెన్స్ తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి  7వ తరగతి ఉత్తీర్ణత ఉండి లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తుకు అర్హులు. 
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు!
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget