అన్వేషించండి

APPSC Group-2: 'గ్రూప్-2' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ తేదీ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?

AP Group 2 Mains: ఏపీలోగ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షకు ఎంపికై అభ్యర్థులకు 2025 జనవరి 5న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.

APPSC Group2 Mains Schedule: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు హాజరుకానున్న 'గ్రూప్ -2' మెయిన్స్ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ బుధవారం (అక్టోబరు 30) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. వచ్చేఏడాది (2025) జనవరి 5న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. గత ఉమ్మడి జిల్లాల (13 జిల్లాల్లో) ప్రాతిపదికన గ్రూప్-2 పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో డీఎస్సీ, పదోతరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని, గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేదీలను నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 

APPSC Group-2: 'గ్రూప్-2' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ తేదీ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 10న విడుదలచేసింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. ప్రిలిమ్స్ ఫలితాల ద్వారా మొత్తం 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా.. 2,557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో తిరస్కరించారు. తాజాగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీలను కమిషన్ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 

గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..

APPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! రిజల్ట్ ఎప్పుడంటే?

* గ్రూప్-2 పోస్టుల వివరాలు

ఖాళీల సంఖ్య: 899

➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333

➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.

➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్. 

➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.

➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్

➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు 
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు 
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్. 

➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్. 

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్

➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఏపీపీఎస్సీ-32, ఎకనామిక్స్ & స్టాటిటిక్స్-06, సోషల్ వెల్ఫేర్-01, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయ్స్-13, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్-02, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేషన్-07, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్-31, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-07, కమిషనర్ ఆఫ్ లేబర్-03, డైరెక్టర్ ఆఫ్ ఏనిమల్ హస్బెండరీ-07, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్-03, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)-08, డీజీ -ప్రిసన్స్ & కోరిలేషనల్ సర్వీసెస్-02, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్-02, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్-02, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ-08, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-01, పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్-19, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-04, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్-01, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్-03, ఇండస్ట్రియల్ ట్రైబ్యూనల్ కమ్ లేబర్ కోర్ట్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్-05, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్-12, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్-01, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-20, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్ & బి-07, ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్-02, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ & వాటర్ ఆడిట్-01, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్-01, కమిషనర్ ఆఫ్ ఆర్కియోలజీ అండ్ మ్యూజియమ్స్-01, ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్-01, ప్రివెంటివ్ మెడిసిన్-01, గవర్నమెంట్ టెక్స్ బుక్ ప్రెస్-01, కమిషనరల్ ఆఫ్ ఇండస్ట్రీస్-05, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్-02, టెక్నికల్ ఎడ్యుకేషన్-09, ఆర్‌డబ్ల్యూఎస్ & ఎస్-01. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget