అన్వేషించండి

AP DSC 2026: ఉపాధ్యాయ నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 3600 పోస్టులతో ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్!

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఏడాది నుంచి ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుంది.
  • ఈసారి సుమారు 3600 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.
  • గత డీఎస్సీలో మిగిలిన పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ లో చేర్చనున్నారు.
  • ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు, అనుభవం ఉన్నవారికి వెయిటేజీ పరిశీలనలో ఉంది.

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామంటూ గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈ ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తారు. గతేడాది డీఎస్సీ ద్వారా 16వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇప్పుడు మిగిలిన వాటిని భర్తీ కోసం కసరత్తు చేస్తున్నారు. 

ఎన్ని పోస్టులు ఉండొచ్చు? పూర్తి లెక్కలేంటి?

ప్రభుత్వం సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డీఎస్సీలో దాదాపు 3600 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖ అధికారులు సేకరించిన ఖాళీల వివరాలను పరిశీలిస్తే, వివిధ విభాగాల్లో పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో 1700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌, సంక్షేమ పాఠశాలల్లో 1200 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దాదాపు 700 వరకు స్పషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. 

గతేడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 16, 347 ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన ఇచ్చింది. ఇందులో 15, 941 ఉద్యోగాలు భర్తీ చేశారు. వివిధ కారణాలతో మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారు. వాటిని కూడా ఈసారి నోటిఫికేషన్‌లో చేర్చనున్నారు. 

సిలబస్‌, పరీక్ష విధానం

పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఒక మంచి విషయం ఏంటంటే ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది డీఎస్సీకి అనుసరించిన సిలబస్‌,  మార్గదర్శకాలనే ఈసారి కూడా వర్తింపజేయనున్నారు. ప్రత్యేక డీఎస్సీకి సంబంధించిన డీఎస్సీకి సంబంధించిన సిలబస్‌ ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులకు ఇంగ్లీష్ ప్రొఫిసియెన్సీ, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట అనుకున్నా ప్రస్తుతానికి సమయం తక్కువ ఉండటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. 

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వెయిటేజీ

రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ మీద పని చేస్తున్న టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, పదేళ్ల సర్వీస్ ఉండి, టెట్ వంటి అర్హతలు సాధించిన విద్యార్థులకు మినిమం టైమ్‌స్కేలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంతా డీఎస్సీ రాసినప్పుడు వారికి వెయిటేజీ ఇచ్చే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 2500మందిపైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. 

నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఏటా డీఎస్సీ క్యాలెండర్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే అభ్యర్థులు కూడా చదువులతో కుస్తీ మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Frequently Asked Questions

AP DSC 2026 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది?

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా AP DSC 2026 నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఈసారి DSCలో ఎన్ని పోస్టులు భర్తీ చేయవచ్చు?

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ DSCలో దాదాపు 3600 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో 1700, ఆదర్శ పాఠశాలలు, రెసిడెన్షియల్‌, సంక్షేమ పాఠశాలల్లో 1200, మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 700 పోస్టులు ఉన్నాయి.

గత DSCలో మిగిలిపోయిన పోస్టులు ఈసారి నోటిఫికేషన్‌లో ఉంటాయా?

అవును, గతంలో 16,347 ఉద్యోగాలకు గాను 15,941 భర్తీ అయ్యాయి. మిగిలిపోయిన ఉద్యోగాలను కూడా ఈసారి నోటిఫికేషన్‌లో చేర్చనున్నారు.

DSC పరీక్షకు సిలబస్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

లేదు, ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. గత DSCకి అనుసరించిన సిలబస్‌, మార్గదర్శకాలనే వర్తింపజేయనున్నారు.

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఏమైనా వెయిటేజీ ఉంటుందా?

పదేళ్ల సర్వీస్ ఉండి, టెట్ అర్హతలు సాధించిన కాంట్రాక్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మినిమం టైమ్‌స్కేలు వర్తింపజేయాలని, DSCలో వెయిటేజీ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget