Diabetes: మధుమేహాన్ని అదుపులో ఉంచాలా? జస్ట్, ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు
మధుమేహం సమస్య వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న కొత్త ఏడాదిలో ఈ చిట్కాలు పాటించి మధుమేహం అంతు చూసేయండి.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఇప్పుడు ఆ మహాభాగ్యం ఎవ్వరికీ లేదనే అనిపిస్తుంది. అందుకు కారణం ఎవరిని కదిలించినా ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఉన్నామనే చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ మందిని వేధిస్తున్న రోగం మధుమేహం. ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, వచ్చాక దాన్ని వదిలించుకోవడం అసాధ్యం. డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉంటే మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. కానీ అదుపులో లేకపోతే మాత్రం అది తీవ్ర అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది.
సరైన సమయంలో చికిత్స చేయకపోతే అధిక రక్తపోటు బారిన పడిపోతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మూత్రపిండాలు, గుండె, కళ్ళు వంటి ప్రధాన అవయవాలని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ని అదుపులో ఉంచేందుకు చిట్కాలు
టైప్ 2 మధుమేహం ఎక్కువగా సరైన ఆహారం, జీవనశైలి మార్పుల వల్ల వస్తుంది. సింపుల్ చిట్కాలు పాటిస్తే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు.
☀ తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు ప్రోటీన్ తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.
☀ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు, అధిక కొవ్వు, ఉప్పు ఉండే ఆహారాలు తీసుకోవడం పరిమితం చెయ్యాలి.
☀ హైడ్రేట్ గా ఉండేందుకు నీరు పుష్కలంగా తాగాలి.
☀ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
☀ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
☀ వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి.
☀ ధూమపానం, మద్యపానం మానుకోవాలి. ఈ రెండు అలవాట్లు మధుమేహం సమస్యని మరింత ప్రమాదాన్ని పెంచుతాయి.
☀ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. అధిక స్థాయి ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతుంది.
☀ షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు కంటి నిండా నిద్ర పోవాలి. నిద్ర తక్కువగా ఉన్న కూడా నీరసించిపోతారు.
☀ మధుమేహం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండటం మంచిది. తాజా పరిశోధన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
☀ ఇతరుల దగ్గర నుంచి సలహాలు తీసుకుని ఆరోగ్యానికి మంచి చేసేవి అయితే పాటించడం మంచిది. మధుమేహంతో బాధపడుతున్న వారికి మీకు తెలిసిన జాగ్రత్తలు చెప్పడం ముఖ్యం. దాని వల్ల వారికి అవగాహన వస్తుంది.
☀ విపరీతమైన దాహం, కంటి చూపు సరిగా లేకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి.
☀ షుగర్ లెవల్స్ పెరిగితే శరీర అవయవాలు, పాదాలు వెంటనే చెప్పేస్తాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది.
☀ నిరంతరం షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ పురోగతి ఎలా ఉందో పర్యవేక్షించుకోవాలి. అవసరమైతే అలవాట్లు, చికిత్స విధానం మార్చుకోవాలి.
☀ బరువుని అదుపులో ఉంచుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం అవసరం. శరీరానికి తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వెల్లులి రెబ్బలు దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది?