Sleeping: వెల్లులి రెబ్బలు దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది?
నిద్ర శరీరానికి చాలా అవసరం. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి సరిపడినంత నిద్ర అవసరం లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అనేక ఒత్తిళ్లతో కూడిన శరీరానికి నిద్ర చాలా అవసరం. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్ర శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లేదంటే నిద్రలేమి, నార్కోలెప్సీ, స్లీప్ అప్నియా వంటి రుగ్మతలు వచ్చి ఇబ్బంది పెడతాయి. ఇవి సాధారణ జీవన విధానాన్ని అల్లకల్లోలం చేస్తుంది. బరువు పెంచేస్తుంది. మధుమేహం వచ్చేస్తుంది. గుండెని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే నిద్రలేమికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. పగటి పూట నిద్ర కంటే రాత్రి నిద్ర శరీరానికి చాలా మంచిది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
హాయిగా, ప్రశాంతంగా నిద్ర పోవాలని అనుకుంటే అందుకు పరిష్కారం.. వంటింట్లో దొరికే ఈ చిన్న వస్తువే! అదేంటో తెలుసా, వెల్లుల్లి. నిద్రని మెరుగుపరచడానికి వెల్లులి గొప్ప ఔషధం అని పూర్వీకుల నుంచి వస్తున్న వాదన. ఇది రాత్రి పూట తల దిండు కింద పెట్టుకుని పండుకుంటే చాలా మంచిదని నమ్ముతారు.
నిద్రకి, వెల్లుల్లికి సంబంధం ఏంటి?
రాత్రంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవాలంటే మీరు పడుకునే ముందు దిండు కింద కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి పూర్తిగా నయం అవుతుందని నిపుణులు అంటున్నారు. కొన్ని శతాబ్ధాలుగా వెల్లుల్లి వంటకాల్లో ఒక భాగం. ఇందులోని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇందులోని అల్లిసిన్ అనే సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి.
నిపుణులు అభిప్రాయం ప్రకారం వెల్లుల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉండటం వల్ల ఘాటైన వాసన వస్తుంది. ఇది నిద్రని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మయో క్లినిక్ ప్రకారం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీర అవయవాలని ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షించడంలో సహాయపడుతుంది. గుండె, మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది.
వెల్లుల్లి GABA అనే ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కండరాలని సడలిస్తుంది. ది మోంట్‌సెరాట్ రిపోర్టర్ ప్రకారం మెదడు కణాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. రాత్రిపూట మెదడులో జరిగే చర్యని ప్రేరేపిస్తాయి. దీని వల్ల నిద్ర లేచిన వెంటనే తాజా అనుభూతి కలుగుతుంది.
శరీరానికి ఎంత నిద్ర అవసరం?
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం పెద్దలు రాత్రి వేళ కనీసం 7-9 గంటల పాటు నిద్రపోవాలి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం గత కొన్నేళ్లుగా నిద్ర సమయం తగ్గుముఖం పట్టిందని తేలింది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నిద్రని ఇబ్బంది పెట్టేవి ఇవే
⦿ గతంలోనే నిద్రలేమి సమస్య ఉంటే మీకు నిద్ర సమయం తగ్గుతుంది. నిద్రలో తరచూ మెళుకువ వచ్చిన నాణ్యమైన నిద్ర పొందలేరు.
⦿ గర్భం ధరించినప్పుడు నిద్ర నాణ్యత తగ్గుతుంది. శరీరం, హార్మోన్ల మార్పుల కారణంగా శారీరక అసౌకర్యంగా ఉంటుంది.
⦿ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు యువకులతో సమానమైన నిద్ర అవసరం. కానీ వయస్సు, అనారోగ్య సమస్యల వల్ల నిద్ర సరిగా ఉండదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గుడ్డు గుండెకు హానికరమా? అతిగా తింటే అంతే సంగతులా?