అన్వేషించండి

Patanjali : మైక్రోప్లాస్టిక్ ముప్పు నుండి ఊపిరితిత్తులకు రక్షణ- పతంజలి పరిశోధనలో కీలక విషయాలు!

Patanjali Claims : మానవ రక్తం, ఊపిరితిత్తుల్లోకి ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయి. పతంజలి రూపొందించిన బ్రాంకోమ్ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

Health News:  నేడు ప్లాస్టిక్ లేని చోటు లేదు. మనం తాగే నీళ్ల బాటిల్, పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్, పాల ప్యాకెట్లు, మందుల ప్యాకింగ్.. ఇలా ప్రతి వస్తువులో ప్లాస్టిక్ నిండిపోయింది. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు కేవలం బయటి ప్రపంచానికే పరిమితం కాకుండా,  మైక్రోప్లాస్టిక్ రూపంలో మన శరీరాల్లోకి ప్రవేశిస్తోంది.

5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ఈ ప్లాస్టిక్ కణాలు ఆవాల గింజ కంటే చిన్నవిగా ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం నుండి సముద్ర గర్భం వరకు ప్రతిచోటా ఇవి విస్తరించాయి. గాలి, ఆహారం, నీటి ద్వారా సగటున ఒక మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ను శరీరంలోకి తీసుకుంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశువు వరకు కూడా చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 ఊపిరితిత్తులపై ప్రభావం- ప్లాస్టిక్ నుండి ఫైబ్రోసిస్ వరకు 

శరీరంలోకి చేరిన మైక్రోప్లాస్టిక్ కణాలు ప్రధానంగా ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. ఇవి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి ఊపిరితిత్తుల కణాలను గట్టిపరుస్తాయి. దీనివల్ల  ఫైబ్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు సరిగ్గా గాలిని పీల్చుకోలేవు. మన శ్వాస వ్యవస్థ సుమారు 2400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వ్యవస్థలోని ప్రతి భాగానికి మైక్రోప్లాస్టిక్ ముప్పు పొంచి ఉంది.

పతంజలి పరిశోధన ఫలితం- బ్రాంకోమ్ 

2022లో ఊపిరితిత్తుల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు చేరినట్లు ఒక పరిశోధనా పత్రం వెల్లడించింది. దీనిపై 2023 నుండి పతంజలి రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిశిత అధ్యయనం చేపట్టారు. ఆయుర్వేదం ద్వారా మైక్రోప్లాస్టిక్ ప్రభావాలను తగ్గించవచ్చని వారు కనుగొన్నారు. ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి, బలోపేతం చేయడానికి 'బ్రాంకోమ్' అనే ఔషధాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.

 శాస్త్రీయ ఆధారాలు - పరిశోధన ప్రక్రియ 

ఈ పరిశోధనలో భాగంగా మైక్రోప్లాస్టిక్ ప్రభావానికి గురైన ఎలుకలకు బ్రాంకోమ్ ఔషధాన్ని ఇచ్చారు. శ్వాస వ్యవస్థ పనితీరును కొలిచే 'ఫ్లెక్సివెంట్ సిస్టమ్' (Flexivent System) ద్వారా ఫలితాలను విశ్లేషించారు. బ్రాంకోమ్ మోతాదును బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

 సూక్ష్మదర్శిని పరీక్షలు ఏం చెబుతున్నాయి 

ఊపిరితిత్తుల్లోని ద్రవాలను  సేకరించి పరీక్షించగా, మైక్రోప్లాస్టిక్ వల్ల పెరిగిన ల్యూకోసైట్లు, న్యూట్రోఫిల్స్ వంటి రోగనిరోధక కణాల స్థాయి బ్రాంకోమ్ వాడకంతో క్రమంగా తగ్గింది. అంతేకాకుండా, వాపును కలిగించే జన్యువుల (IL-6, IL-8, TNF-alpha) ప్రభావాన్ని కూడా ఈ మందు సమర్థవంతంగా నియంత్రించింది.

 కణజాల పరీక్షల్లో స్పష్టమైన మార్పులు 

ఊపిరితిత్తుల కణజాల పరీక్షలు (Histopathology) మైక్రోప్లాస్టిక్ వల్ల దెబ్బతిన్న శ్వాసనాళాలు తిరిగి పూర్వస్థితికి చేరుకున్నట్లు నిరూపించాయి. గాలి ప్రసరణ వేగం, ఊపిరితిత్తుల సాగే గుణం మెరుగుపడ్డాయి. మానవ కణాలపై (THP-1 cell line) చేసిన ప్రయోగాలు కూడా సానుకూల ఫలితాలను ఇచ్చాయి.

  ఆధునిక సమస్యకు ఆయుర్వేద పరిష్కారం 

మైక్రోప్లాస్టిక్ ముప్పు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో, బ్రాంకోమ్ వంటి ఆయుర్వేద మందులు కొత్త ఆశను కలిగిస్తున్నాయి. అంకితభావంతో పరిశోధనలు చేస్తే, ఆధునిక ఆరోగ్య సమస్యలకు పురాతన ఆయుర్వేద చికిత్సలు సరైన పరిష్కారం చూపుతాయని ఈ అధ్యయనం నిరూపించింది.

 Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.

 

టాప్ హెడ్ లైన్స్

White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget