అన్వేషించండి

గుండె పోటుకు, ఛాతీ మంటకు మధ్య తేడా తెలుసుకోవడం ఎలా?

గుండె నొప్పిని, ఛాతీ మంట అనుకుంటే పరిస్థితి చేజారిపోతుంది.

ఇప్పుడు గుండె పోటు ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేం. కొంతమంది ఛాతీ మంటను కూడా గుండె పోటు అనుకునే అవకాశం ఉంది. తీసుకునే ఆహారం కారణంగా ఛాతీమంట కలిగే అవకాశం ఉంది. అలాగే గుండె నొప్పిని కూడా ఛాతీ మంట అనుకునే ఛాన్సు ఉంది. అలాంటప్పుడు పరిస్థితి చేయిదాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండింటికీ మధ్య తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఆ రెండింటి లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. ఛాతీ మంట అనేది జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నడం వల్ల ఛాతీ మంట మొదలవుతుంది. ఇది చిన్న సమస్యే. అయితే గుండె పోటు వేరు. గుండెకు వెళ్లే రక్త నాళాల్లో పూడికలు ఏర్పడడం, గడ్డలు ఏర్పడడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం కలిగి గుండె నొప్పి మొదలవుతుంది. ఇది మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అత్యవసర స్థితి. గుండె పోటును ఛాతీ మంటగా భావించి వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు. అందుకే ఈ రెండింటి లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం. 

గుండె పోటు లక్షణాలు 
1. గుండె పోటు ఎప్పుడైనా ఛాతీ మధ్యలో నుంచి మొదలవుతుంది. గుండె ఎడమవైపు ఉంటుంది కదా, నొప్పి అక్కడ నుంచి రావాలి కదా అనుకోవద్దు. 
2. ఛాతీ బిగపట్టినట్టు అయి, గుండె పిండేస్తున్నట్టు, దేనితోనో పొడుస్తున్నట్టు అవుతుంది. నొప్పి మెల్లగా మొదలై వచ్చి, పోతూ ఉంటుంది. 
3. నొప్పి మెల్లగా భుజాలకు, దవడలకు, మెడ,  చేతులకు పాకుతుంది. 
4. గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. ఒళ్లంతా చెమట్లు పడతాయి. 
5. తల తిరుగుతుంది. బలహీనంగా మారిపోతారు. 
6. ఊపిరి ఆడక ఇబ్బంది పడతారు. 
7. వాంతులు అయ్యే అవకాశం ఉంది. 

ఛాతీ మంట లక్షణాలు
1. ఛాతీలో సూదితో గుచ్చినట్టు చిన్నగా మంట మొదలవుతుంది. పక్కటెముకల్లోని పొడవాటి ఎముకల్లో కూడా నొప్పి వస్తుంది. 
2. జీర్ణాశయం నుంచి పుల్లటి తేనుపులు రావడంతో పాటూ, గొంతు చేదుగా మారుతుంది. 
3. ఛాతీ నొప్పి గొంతుకు పాకుతుంది. కానీ మెడ, చేతులు, భుజాలు మాత్రం నొప్పి పెట్టవు. 
4. ఆహారం పొట్టలోంచి గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. 

మీకు వచ్చే నొప్పిని మీరే గుర్తు పట్టాలి. అప్పుడే మీకు వచ్చింది గుండె నొప్పా లేక ఛాతీ నొప్పా అనేది తెలుస్తుంది. 

Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే ఏమవుతుంది?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
First Time Drinking Alcohol : మందు మొదటిసారి తాగాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
మందు మొదటిసారి తాగాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget