By: Haritha | Updated at : 25 Dec 2022 09:59 AM (IST)
(Image credit: Pixabay)
Diabetes: డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని కమ్మేస్తున్న అది పెద్ద ఆరోగ్య సమస్య. మనదేశంలో కొన్ని కోట్ల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. వీరు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలకు దూరంగా, పానీయలకు దూరంగా ఉండాలి. కానీ ఎంతో మంది ఒక పక్క మధుమేహం మందులు వేసుకుంటూనే, మరోపక్క నచ్చినట్టు తినేస్తున్నారు. ఇదే వారిలో ప్రాణాంతక సమస్యలను తీసుకొస్తుంది. మధుమేహం అదుపులో ఉండకపోతే కిడ్నీ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కచ్చితంగా మధుమేహులు ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
మద్యం తాగితే...
ఎంతో మందికి మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం తాగడం వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మధుమేహం ఉన్న వారు మద్యం తాగినా సమస్య పెరిగిపోతుంది.నేరుగా చెప్పాలంటే మధుమేహం ఉన్నవారు మద్యం తాగనే కూడదు. ఈ విషయంలో అప్పుడప్పుడు తాగొచ్చా వంటి బేరసారాలు కూడా పనిచేయవు. మధుమేహం వచ్చిన వారిలో సమస్య వారి నాడులు, నాడీ కణాలు దెబ్బతింటాయి. ఇక మద్యం తాగడం వల్ల కూడా జరిగేది అదే. మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే రెట్టింపు వేగంతో నాడులు దెబ్బతింటాయి. దీని వల్ల ఒళ్లంతా మంటలు పుట్టడం, తిమ్మిర్లు రావడం, సూదులతో పొడిచినట్టు అనిపించడం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి ఇంకా ముదిరితే కాళ్లు, పాదాలు మొద్దుబారిపోతాయి. పుండ్లు పడతాయి. ఆ పుండ్లు తగ్గవు. అలాంటప్పుడు పాదాలు లేదా కాళ్లు తొలగించాల్సి వస్తుంది.
అనుకోకుండా మద్యం తాగాల్సి వస్తే కాసేపటికి పొట్ట నిండా భోజనం చేయాలి. ఆ తరువాత మధుమేహం మందులు వేసుకోవాలి. మద్యం తాగాక భోజనం చేయకుండా మాత్రం మందులు వేసుకోకూడదు. మద్యం తాగాక మందులు వేసుకుంటే అవి రెండూ కలిసి కొత్త సమస్యలు తెస్తాయి. ఛాతీలో మంట, వాంతులు, ఒక్కోసారి రక్తపు వాంతులు కూడా కావచ్చు. కాబట్టి మద్యం తాగాక ఎట్టి పరిస్థితులు మధుమేహం మందులు వేసుకోవద్దు.
మన శరీరంలోని కాలేయం ఎల్లప్పుడు గ్లూకోజును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మద్యంలో కాలేయానికి చేరుతుందో ఆ పనికి ఆటంకం కలుగుతుంది. గ్లూకోజు సరిగా ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో ఒక్కసారిగా కిందపడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కళ్లు సరిగా కనిపించక, కళ్లు తిరిగినట్టు అవుతాయి. కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మద్యం పూర్తిగా తాగడం మానేయడమే ఉత్తమం.
Also read: మీకు ఆందోళనగా, దిగులుగా అనిపిస్తోందా? అయితే ఈ రెండు లోపాలు ఉన్నట్టే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Weight Loss: కండల కోసం ప్రొటీన్ షేక్లకు బదులు ఈ పానీయం తాగండి
Milk Coffee: మిల్క్ కాఫీ మంచిదే, కానీ ఈ సమస్యలున్న వాళ్ళు మాత్రం తాగకూడదండోయ్
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్
World Cancer Day 2023: క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మూడు రకాల ఆహార పదార్థాలు ఇవే, తినడం మానేస్తే మీకే మంచిది
Diabetes: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
BRS Nanded Meeting : నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?