News
News
X

New Startup : వాడేసిన శానిటరీ ప్యాడ్స్ రీసైకిల్ స్టార్టప్ - ఈ కుర్రోడి ఐడియాకు పడిపోయిన ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ సుధామూర్తి !

వాడేసిన శానిటరీ ప్యాడ్స్ అంటేనే అసహ్యంగా చూస్తాం. కానీ అతను ఏకంగా వాటితో ఓ స్టార్టప్ పెట్టేశాడు. ఈ కుర్రాడి ఐడియాకు ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ సుధామూర్తి బాసటగా నిలిచారు.

FOLLOW US: 
Share:

New Startup  : శానిటరీ ప్యాడ్స్! ఇప్పటికీ ఆ ఐదు రోజుల పీరియడ్స్ మీద భారతీయ మహిళ ఓపెన్ గా మాట్లాడలేపోతోంది! పొత్తికడుపులో మెలిపెట్టే నరకంపై స్టిల్- మౌనంగానే ఉంది యవతి! మెడికల్ షాపులో నుంచి ఇంకా నల్లటి కవర్లలోనే చుట్టి రహస్యంగా తీసుకొస్తున్నారు! వాడేసిన ప్యాడ్లను పాత న్యూస్ పేపర్లలో చుట్టి వాష్ రూంలో బెరుకుబెరుగా మూలకు పెడుతున్నారు! ఐదారు ప్యాడ్లు కాగానే ఏదో తెలియని అపరాధ భావంతో చెత్తకుండీలో పడేస్తున్నారు! ఇదొక ఎడతెగని సోషల్ స్టిగ్మా!

మీకో విషయం తెలుసా! ఇప్పటికీ 50 శాతానికి పైగా శానిటరీ ప్యాడ్స్ అంటే ఏంటో గ్రామీణ భారతానికి తెలియదు! వాడిపడేసిన శానిటరీ ప్యాడ్స్, బేబీ డైపర్ల వేస్టేజీ యేడాదికి సుమారు 3.37 లక్షల టన్నులంటే నమ్మశక్యం కాదు! శానిటరీ ప్యాడ్ భూమిలో కలిసిపోవడానికి 500 నుంచి 800 సంవత్సరాలు పడుతుందంటే మీరు నోరెళ్లబెడతారు!

ఇప్పటికీ చాలా నగరాల్లో శానిటరీ వేస్టేజీని- రెగ్యులర్ చెత్తనుంచి వేరు చేయరు. బ్లడ్ ఉంటుంది కాబట్టి  కొన్ని చోట్ల మగకార్మికులు వాటిని ముట్టుకోడానికి ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి యేటా 1,13,000 టన్నుల కంటే ఎక్కువ యూజ్డ్ శానిటరీ నాప్‌ కిన్‌ లు డౌన్ ఏరియాలకు చేరుతుంటాయి.

చూసీచూడనట్టు వ్యవహరించే రోజువారీ వ్యవహారం ఒక యువకుడిని ఆలోచనలో పడేసింది! భూమ్మీద ఎన్నో వ్యర్ధాలు రీసైకిల్ అవుతున్నాయి! ఆడవారు నెలసరి కోసం వాడి పడేసిన ప్యాడ్స్ మాత్రం ఎందుకు పోగుపడుతున్నాయి! వాటిని ముట్టుకునే సాహసమే ఎందుకు చేయడం లేదు? ఒకవేళ రీసైకిల్ చేసే ఛాన్స్ ఉంటే, ఏం చేయాలి? ఇలాంటి సంఘర్షణతో పుట్టుకొచ్చింది ప్యాడ్ కేర్ ల్యాబ్ స్టార్టప్!

అజింక్య ధరియా! ప్యాడ్‌కేర్ ల్యాబ్‌ సృష్టికర్త! ఒక్కమాటలో చెప్పాలంటే వాడి పడేసిన ప్యాడ్లకు రీ సైకిల్ పరిష్కారం కనుగొన్న సోషల్ సైంటిస్ట్! అలాగని ఒక్కమాటతో తీసేసే వ్యవహారం కాదిది! దీని వెనకాల ఎంతో రీసెర్చ్‌! అంతకుమించి కమిట్ మెంట్! ఆపైన అందమైన ఔట్ పుట్!

మహారాష్ట్రలోని మాసా అనే చిన్న గ్రామానికి చెందిన అజింక్యా ధారియా పుణెలోని ఒక కంపెనీకి ఇస్రో ప్రాజెక్ట్‌లో పనిచేసేటప్పుడు ఈ దిశగా అడుగులు పడ్డాయి! వ్యర్థాలను పారవేయొద్దు! వాటికి పరిష్కారం ఉండాలి! ఇదే సూత్రంపై ముందుకు కదిలాడు. అనారోగ్యకరమైన ప్యాడ్లను కాల్చేస్తే ఇంకా ఎక్కువ నష్టం! గాలిలోకి విషవాయువులు విడుదలవుతాయి. లేనిపోని రోగాలు! పైగా వృధా ప్రయాస! అందుకే  దీనికో పరిష్కారం కనుక్కోవాలని గట్టిగానే అనున్నాడు.

2018లో స్టార్టప్‌ గా ఏర్పడింది- ప్యాడ్‌కేర్ ల్యాబ్‌. శానిటరీ వ్యర్థాలను రీ సైకిల్ చేయడమే దీని కాన్సెప్ట్! ముందు వాటిని చెత్తకుండీల నుంచి కాకుండా వాష్ రూంల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం ఒక మెషీన్ డెవలప్ చేసి, లేడీస్ టాయిలెట్లలో ఇన్ స్టాల్ చేశాడు! పేపర్లలో చుట్టి అక్కడా ఇక్కడా పడేయకుండా ఆ ప్యాడ్ ను తీసి ఆ మెషీన్ లో వేయాలి!

ఇండియన్ టాయిలెట్ల గురించి తెలియంది కాదు! చాలావరకు వాష్‌ రూంలన్నీ చాలా కాంపాక్టుగా ఉంటాయి! నీళ్లు కూడా పెద్దగా రావు. అయినా సరే, శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్‌లతో పాటు, కంపెనీ వాష్‌రూమ్‌లలో అమర్చడానికి ప్యాడ్‌ కేర్ బిన్‌లను డెవలప్ చేశాడు. అందులో వేసిన శానిటరీ వ్యర్థాలు నెల రోజుల వరకు ఉంటాయి! వాసన రాదు. బ్యాక్టీరియా చేరదు. 30 రోజుల తర్వాత బిన్ నుంచి తీసి రీ సైకిల్ చేసే ప్లాంటుకు తరలిస్తారు. ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిది అంటాడు ధరియా! 5D టెక్నాలజీ ఆధాంగా వీటిని రీ సైకిల్ చేస్తారు.

ఇదంతా ఓవర్ నైట్‌లో జరగలేదు. నాలుగేళ్ల శ్రమ. 5వేలకు పైగా ట్రయల్స్! అన్నీ ఫెయిల్! అయినా పట్టువదల్లేదు! చివరిగా ఒక విజయం మెరుపులా బయటకి వచ్చింది.    ఆ ఊపులోనే యేడాదిన్నర క్రితం 100 కిలోల కెపాసిటీ కలిగిన మెషీన్ తీసుకొచ్చారు. 1.5 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ కెపాసీటీ త్వరలో ప్రారంభించబోతున్నారు.

దేశంలోని సుమారు 250 ఆఫీసుల్లో 6వేల ప్యాడ్‌ కేర్ బిన్లు ఉచితంగా ఇన్‌ స్టాల్ చేశారు. పుణెలో 2 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారు. ప్రతిరోజూ 1.5 టన్నుల ప్యాడ్లు ప్రాసెస్ చేస్తారు. మెటా, క్యాప్ జెమినీ, టీసీఎస్ లాంటి కార్పొరేట్ సంస్థల్లో ప్యాడ్ కేర్ బిన్స్ ఇన్ స్టాల్ చేశారు. థర్డ్-పార్టీ ద్వారా  వ్యర్థాలను యూనిట్‌కు తరలిస్తారు.  

వాటిని రీసైకిల్ చేసిన ప్యాడ్స్ నుంచి పల్ప్, ప్లాస్టిక్ అవుట్‌ పుట్‌ గా వస్తుంది. అలా వచ్చిన ప్లాస్టిక్ ను ప్యాడ్‌ కేర్ డబ్బాలను తయారు చేయడానికి వాడుతారు. పల్ప్ నుంచి మొక్కల కుండీలు, ఇతర అలంకార వస్తువులు, స్టేషనరీ ఐటెమ్స్ తయారు చేస్తారు!  

ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం! అయినా సరే, అజింక్యా వెనుకడుగు వేయలేదు. యూనిట్లను బెంగళూరు, ఢిల్లీలో ఇన్‌స్టాల్ చేయాలని చూస్తున్నాడు. శానిటరీ ప్యాడ్స్ కేవలం ఒక రీసైక్లింగ్ యూనిట్ మాత్రమే కాదు! ఒక ఆరోగ్యకర సామాజానికి ఉపయోగపడే అరుదైన వేదిక! ప్యాడ్‌ కేర్ ల్యాబ్స్ లక్ష్యం ఎంతో ఉన్నతమైంది! వాళ్లని అభినందించడం అనేది చాలా చిన్నమాట! అందుకే ఈ సోషల్ ఆంట్రప్రెన్యూర్‌ కు ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ సుధామూర్తి బాసటగా నిలిచారు! మరి వాళ్లని మనమెందుకు ఎంకరేజ్ చేయకూడదు!

 

Published at : 11 Mar 2023 04:53 PM (IST) Tags: Health Pune plastic Women sanitary pada recycle ajinkya

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

New Corona Cases : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - ఆ వేరియంటే కారణమా ?

New Corona Cases : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - ఆ వేరియంటే కారణమా ?

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌