By: Haritha | Updated at : 13 Mar 2023 11:57 AM (IST)
(Image credit: Pixabay)
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినాల్సిన అవసరం ఉంది. అయితే తినే ముందు వాటిని శుభ్రపరచడం ముఖ్యం. చాలామంది నీటిలో వేసి ఇలా ముంచి అలా తీసేస్తారు. అలా చేయడం వల్ల త్వరగా రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని సరిగా శుభ్రం చేయకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. పండ్లు లేదా కూరగాయలు పొలంలో పెరిగడం, వాటిని కోసాక నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి సమయాల్లో వాటిపై కొన్ని కలుషితాలు చేరే అవకాశం ఉంది. కలుషితమైన నేల, నీరు వంటి వాటికీ అవి బహిర్గతం కావడం వల్ల లేదా ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ వంటి విషయాల్లో అతి రసాయన మార్పులకు కూడా గురి కావచ్చు. కాబట్టి వాటిని తినే ముందు సరిగా శుభ్రం చేసుకోవడం అవసరం.
సాధారణంగా వాటిని మార్కెట్లలో అమ్ముతారు. మార్కెట్లలో పరిశుభ్రత తక్కువ ప్రమాణాలను కలిగి ఉంటుంది. పేలవమైన పారిశుధ్యం వల్ల జీర్ణాశయాంతర రుగ్మతలు రావచ్చు. పండ్లు, కూరగాయలపై సూక్ష్మజీవులు చేరి అవి సరిగా కడగక పోవడం వల్ల మన పొట్టలో చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కాబట్టి వాటిని తినే ముందు లేదా వండే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
1. పండు లేదా కూరగాయలు కోయడానికి ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
2. పండు లేదా కూరగాయ పొట్టు తీసే వీలుంటే, అలా తీసేసి తినడం మంచిది.
3. ఆకుకూరలు లేదా పువ్వుల్లాంటివి పెద్ద గిన్నెలో చల్లని నీటిలో వేసి రెండు నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టాక ఆకుకూరలను చేత్తో రుద్ది కడగడం చాలా ముఖ్యం.
4. స్ట్రాబెర్రీలు వంటి సున్నితమైన పండ్లను చల్లని నీటిలో వేసి కాసేపు ఉంచి శుభ్రమైన టవల్ తో తుడవాల్సిన అవసరం ఉంది.
5. మార్కెట్లో వెజిటబుల్ బ్రష్‌లు దొరుకుతున్నాయి. వాటితో పండ్ల పైన రుద్దడం వల్ల కూడా కలుషితాలు పోవచ్చు.
6. పుట్టగొడుగులను కూడా చల్లటి నీటిలో వేసి కడగాలి. తరువాత వాటిని శుభ్రమైన క్లాత్ తో తుడవాలి.
పండ్లు కూరగాయలు వంటి వాటిని కడగడానికి సబ్బు లేదా డిటర్జెంట్ ను ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. మార్కెట్లో వెజిటబుల్ వాష్‌లు, ప్రోడక్ట్ వాష్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామంది వీటిని వాడుతూ ఉంటారు. కానీ వీటిని వాడడం కూడా అనవసరమే. ఎందుకంటే నీటితో శుభ్రం చేస్తేనే కలుషితాలు అధికంగా పోతాయి. ఈ వాష్‌ల వాడడం వేస్టు.
Also read: ఇలా స్వీట్ నిమ్మ పొడిని రెడీ చేస్తే, ఇనిస్టెంట్‌గా నిమ్మరసం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
నిజామాబాద్ జిల్లాకు గోల్డ్ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం
Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?
Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల