High blood pressure :యాపిల్ కాదు, రోజుకో టమోటా తింటే డాక్టర్‌తో పని ఉండదట - ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసా?
High blood pressure : ఆల్ఫా బీటా లుటిన్, లైకోపీన్ కెరోటినాయిడ్స్ టమోటాలలో ఉంటాయి. కెరోటినాయిడ్లతో పోలిస్తే లైకోపీన్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. టమాటాను తింటే అధిక బీపీకి చెక్ పెట్టొచ్చు.
High blood pressure: రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అనేది కాదనలేని నిజం. అయితే, టమోటా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. మీరు యాపిల్‌కు బదులు టమోటా తింటేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఔనండి.. టమోటాల వల్ల కలిగే ఆ బెనిఫిట్స్ ఏమిటో చూసేయండి మరి.
అధిక రక్తపోటు అనేది ఆధునిక కాలంలో ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ వ్యాధికి ప్రధాన కారణాలు ఒత్తిడి, అనియంత్రిత ఆహారపు అలవాట్లు. ఇది కాకుండా,పేలవమైన రోజువారీ దినచర్య కూడా రక్తపోటుకు కారణం అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధమనులలో రక్తపోటు పెరగడం వల్ల ఈ సమస్యకు దారి తీస్తుంది. అధిక రక్తపోటును సాధారణంగా హైపర్ టెన్షన్ అని కూడా అంటారు.
ధమనులలో రక్త ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గుండె చాలా కష్టపడాలి. ఈ రోజుల్లో 30 ఏళ్లకే రక్తపోటు సమస్య వస్తుంది. అధిక రక్తపోటు వల్ల శరీరంలోని అన్ని భాగాలు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా గుండెపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా అధిక బీపీతో బాధపడుతుంటే ప్రతిరోజూ టమోటాను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమోటాలో ఉండే పొటాషియం, లైకోపీన్ కంటెంట్ కారణంగా ప్రతిరోజూ టొమాటోలు తినే వ్యక్తులకు రక్తపోటు ముప్పు తగ్గుతుందని తాజా స్టడీ పేర్కొంది.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో గత నెలలో ఓ అధ్యయనంలో ఈ వార్తను ప్రచురించింది. టమోటాలు అధిక రక్తపోటును సమర్థవంతంగా ఎదుర్కొంటాయని అధ్యయనం పేర్కొంది. టమోటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గించడం ద్వారా రక్తపోటును కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాదు గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో టమోటా కూడా ఒకటని తాజా అధ్యయనం తెలిపింది.
తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 7- వేల మందికిపైగా స్పానిష్ ప్రజలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వారి జీవనశైలి, ఆరోగ్యపరిస్థితులను పరిగణలోనికి తీసుకున్నారు. రోజూ టమోటా తినేవారిని, టమోటా ఉత్పత్తులను తినేవారిని, టమాటా అసలు తినని వారిని నాలుగు సమూహాలుగా విభజించారు. తక్కువ టమాటా తీసుకునేవారిలో అధికరక్తపోటు ప్రమాదం 36శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. మితంగా తీసుకున్నవారిలోనూ రక్తపోటు తగ్గించే ప్రభావం కలిగి ఉందని అధ్యయనం పేర్కొంది. పరిశోధన ప్రకారం అధికరక్తపోటు ఉన్నవారిలో తక్కువ మార్పులు కనిపించాయి. ఈ వ్యక్తుల వయస్సు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చని పరిశోధకులు సూచించారు.
టమోటాలు ఎందుకు తినాలి?
ఆల్ఫా, బీటా, లుటీన్, లైకోపీన్ కెరోటినాయిడ్స్ టొమాటోలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, ఇతర కెరోటినాయిడ్స్‌తో పోలిస్తే లైకోపీన్ అత్యధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వాపును తగ్గిస్తుంది. ఇలాంటి గుణాలు టొమాటోలో చాలా ఉన్నాయని, దీని వల్ల ట్యూమర్లు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఎ, సి, ఇ టమోటాలలో లభిస్తాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ అవయవాలు సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇది అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టొమాటోలు మధ్యధరా ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇది గుండెకు ఉత్తమమైన ఆహారం. ఒక పరిశోధన ప్రకారం, టొమాటోలను ఇతర ఆహారంలో తీసుకోవడం వల్ల కెరోటినాయిడ్ల శోషణ 15 రెట్లు పెరుగుతుంది. దీని కోసం మీరు మీ ఆహారంలో టమోటాలు తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీని వినియోగం అధిక బీపీ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. చాలా సందర్భాలలో, రక్తపోటు యొక్క లక్షణాలు గుర్తించబడవు. చాలా సందర్భాలలో ఇది అనియంత్రితంగా ఉంటుంది. ఇది ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అధిక బీపీని నియంత్రించడానికి, టమోటా ప్రతిరోజూ తీసుకోవాలి. టొమాటో హైపర్‌టెన్షన్‌ని నియంత్రించగలదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. టమోటా రక్తపోటును తగ్గించడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
టమోటోలతోపాటు గుండె-ఆరోగ్యకరమైన, యాంటీహైపెర్టెన్సివ్ డైట్‌లో భాగమైన ఇతర పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు:
- అవకాడోలు
- పెరుగు
- అరటిపండ్లు
- నారింజ
- పాలకూర
- ఎండుద్రాక్ష
- జీవరాశి
- దుంపలు
అధిక పొటాషియం మూత్రపిండాల రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు హానికరమని వైద్యులు చెబుతున్నారు. రక్తం నుండి పొటాషియంను తొలగించడానికి మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. మూత్రపిండాలు ఈ పనిని సమర్ధవంతంగా నిర్వహించలేకపోతే, అది శరీరంలో పొటాషియం పేరుకుపోవడానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితి అయిన హైపర్‌కలేమియాకు దారి తీస్తుంది.
Also Read : కొవిడ్ జెఎన్ 1 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.